Begin typing your search above and press return to search.
న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదు...తేల్చేశారుగా!
By: Tupaki Desk | 10 Aug 2022 11:24 AM GMTగత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంటూ ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చగా వేడిగా వాడిగా సాగిన రాజకీయ రచ్చకు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ముగింపు పలికారు. అది ఫేక్ వీడియో అని తేల్చేశారు. పైగా ఒరిజినల్ కాదని కూడా స్పష్టం చేశారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చలామణీలో ఉన్న మాధవ్ పేరిట న్యూడ్ వీడియోలు అన్నీ కూడా ఫేక్ అనే ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా ఒకటికి పదిసార్లు ఎడిటింగ్ చేసినవి, ఫార్వర్డ్ చేసినవి అని కూడా ఆయన పేర్కొనడం విశేషం. అందువల్ల ఈ ఫేక్ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించినా ఉపయోగం లేదని ఆయన అంటున్నారు.
తాము ఏ రాజకీయ పక్షం వహించడం లేదని, కేసుని కేసుగానే చూసి ప్రాధమిక విచారణ చేపట్టామని, తమకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 4న అర్ధరాత్రి 2.07 నిముషాలకు ఐ టీడీపీ గ్రూపు లోనే ఈ వీడియో వైరల్ అయిందని ఆయన చెప్పారు. 447443703868 అనే నంబర్ నుంచి పోస్ట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చునని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. యూకేలో రిజిష్టర్ అయిన ఒడా ఫోన్ నంబర్ నుంచి వీడియో అప్ లోడ్ అయిందని ఫకీరప చెప్పారు. ఇక ఈ వీడియో చాలా సార్లు ఫార్వర్డ్ అయి రీ పోస్ట్ అయినట్లుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు.
ఇక ఎంపీ ఫోన్ ని సీజ్ చేసి ఫోరెన్స్కి ల్యాబ్ కి పంపి విచారణ జరిపితే అసలు నిజాలు బయటపడవచ్చు కదా అని విలేకరులు అడిగిన దానికి ఫకీరప్ప అలా చేయడానికి వీలు లేదని చెప్పడం విశేషం. బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తేనే తప్ప ఆ దిశగా యాక్షన్ తీసుకోలేమని ఆయన పేర్కొన్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని పట్టుకుని ఎవరి ఫోన్ అయినా సీజ్ చేయడం అంటే అది చట్ట ప్రకారం చేయకూడని విషయం అని ఆయన అంటున్నారు.
మొత్తానికి ఎంపీ గోరంట్ల విషయంలో దాదాపుగా క్లీన్ చీట్ ఇచ్చినట్లుగానే ఫకీరప్ప స్టేట్మెంట్ ఉంది. ఇకపోతే దీని మీద ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా స్పందించారు. తాను ఫేక్ వీడియో అని మొదటి నుంచి మొత్తుకుంటున్నా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, టీడీపీ అనుకూల మీడియా రచ్చ చేశారని మండిపడ్డారు. తన పరువు తీశారని అన్నారు. రాజకీయంగా తనను బదనాం చేయడానికే ఈ వీడియోను పెట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు లోకేష్, అనుకూల మీడియా అంతా కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు.