Begin typing your search above and press return to search.

బర్త్ డే బాయ్ - కేశ‌వ్ గర్జన తగ్గిందెందుకో

By:  Tupaki Desk   |   14 May 2022 10:39 AM GMT
బర్త్ డే బాయ్ - కేశ‌వ్ గర్జన తగ్గిందెందుకో
X
అనంతపురం టీడీపీ లీడ‌ర్ ప‌య్యావుల కేశ‌వ్ బర్త్ డే నేడు. వాస్త‌వానికి విప‌క్ష నేత‌ల్లో య‌న‌మ‌ల త‌రువాత బ‌లీయంగా గ‌ణాంక స‌హితంగా మాట్లాడే స‌త్తా ఉన్న లీడ‌ర్, అనంత రాజకీయాల్లో ఎందుక‌నో రాజీ ప‌డుతూ ఉన్నారు. అదే ఇప్పుడు మైన‌స్. బాల‌య్య‌కు దీటుగా ప‌ని చేయ‌గ‌ల స‌త్తా ఉన్న మాస్ లీడ‌ర్.

ప‌దాలు సంబంధిత ఉచ్ఛార‌ణ కూడా బాగుంటుంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ముఖ్యంగా అధికార ప‌క్షం ఒత్తిళ్ల కార‌ణంగా కేశ‌వ్ ఓ ద‌శ‌లో పార్టీ మారుతాను అని అనుకున్నా ఆగిపోయి వెన‌క్కు త‌గ్గారని అంటారు. ఇప్పుడు ఇష్టం వ‌చ్చిన విధంగా మాట్లాడుతున్న అధికార పార్టీకి చెందిన వారంద‌రికీ అప్పుడు ప‌య్యావుల కేశ‌వ్ ఎంత‌గానో ఎదుర్కొన్నారు.

కానీ ఆ రోజున్న వేగం ఇప్పుడు ఆయ‌నలో లేదు. ఆయ‌నే కాదు అనంత‌పురం కేంద్రంగా ఆ రోజు రాజకీయం న‌డిపిన వారెవ్వ‌రిలోనూ లేదు. ఈ ద‌శ‌లో ఆయ‌న మ‌ళ్లీ పుంజుకోవాలి. కొత్త ఉత్సాహం నింపుకోవాలి. మ‌ళ్లీ మ‌ళ్లీ రాజ‌కీయ రంగాన మంచి నాయ‌కుడిగా పేరు తెచ్చుకోవాలి కూడా !

వాస్త‌వానికి ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ గా ఉన్న ప‌య్యావుల కేశ‌వ్ గ‌త ఏడాది చాలా విష‌యాలపై కూలంకుషంగానే మాట్లాడారు. కాగ్ నివేదిక పై కానీ, ఎస్క్రో పేరిట లోన్లు తీసుకుంటున్న వైనంపై కానీ మ‌ద్యం పాల‌సీ నుంచి అద‌నంగా పిండుతున్న ఆదాయంపై కానీ అన్నింటిపై కేశ‌వ్ బాగా మాట్లాడారు. జ‌గ‌న్ ను నిలువ‌రించారు.

జిల్లాల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న ఎందుక‌నో ఆ స్పీడుతో మాట్లాడ‌లేక‌పోయారు. కనీసం బాల‌య్య మాట్లాడిన విధంగా కూడా మాట్లాడ‌లేక‌పోయారు. ఎందుక‌నో చాల ఆ విష‌యాల‌పై అధినేత స్పందిస్తూ ఉన్నా కీల‌క ప‌ద‌విలో ఉన్న ప‌య్యావుల కేశ‌వ్ మాత్రం స్పందించ‌డం లేదు. దీంతో ఓ ద‌శ‌లో ఆయ‌న్ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని కూడా బాబు భావించారు.

తాజాగా అస‌ని మిగిల్చిన తుఫాను న‌ష్టాల‌పై మాట్లాడితే బాగుంటుంది కానీ మాట్లాడ‌డం లేదు. ఏ విధంగా చూసుకున్నా ఇష్యూస్ ఉన్న‌ప్పుడే క‌దా మాట్లాడాలి కానీ ఆయ‌న త‌న ప‌ని తాను చేసుకుంటూ సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉర‌వ‌కొండ‌కే ప‌రిమితం అయి ఉన్నారన్న వాద‌న ఒక‌టి బ‌లీయంగా వినిపిస్తోంది. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ కొంత పొలిటిక‌ల్ హీట్ పెంచుతున్నా ప‌య్యావుల మాత్రం జ‌గ‌న్ స‌ర్కారును నిలువ‌రించే, ఎదిరించే ప‌ని ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఇటీవ‌ల కాలంలో చేయ‌లేదు.ఇదే వాస్త‌వం.. పార్టీ ప‌రంగా ఆయ‌న అభిమానుల‌కు విచార కార‌కం కూడా !