Begin typing your search above and press return to search.
బీజేపీలో మరో బిగ్ టంగ్
By: Tupaki Desk | 18 Jan 2018 3:20 PM GMTరాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్నితొలగించాలంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే మరోసారి తన నోటికి పనిచెప్పారు. రెండు రోజుల కిందట ఆయన రచయితలు - మేధావులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కన్నడనాట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే రచయితలపై, మేధావులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి హెచ్ ఎం రేవన్న అనంతకుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతకుమార్ నాలుకకు ఏమైందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంత కుమార్ ను పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ ఆయన మండిపడ్డారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అనంతకుమార్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన అత్యంత బాధ్యతారాహిత్యపు మనిషని అన్నారు. ఆయన గురించి మాట్లాడడం వేస్టంటూ తీసిపడేశారు. కాగా కొద్దిరోజుల కిందటే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా బీజేపీ పెద్దలు చివరకు ఆయనతో క్షమాపణ చెప్పించారు. కానీ... అనంత మాత్రం తన తీరు మార్చుకోకుండా నోటికి పని చెప్తూనే ఉన్నారు.