Begin typing your search above and press return to search.
తప్పు మీద తప్పు చేస్తున్న ప్రదీప్!
By: Tupaki Desk | 4 Jan 2018 5:14 AM GMTకొత్త సంవత్సరం వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ టీవీ యాంకర్ 35 ఏళ్ల మాచిరాజు ప్రదీప్ అడ్డంగా బుక్ కావటం తెలిసిందే. తాగి వాహనాల్ని నడపొద్దంటూ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా పట్టించుకోకుండా.. పూటుగా తాగేసి తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయిన వైనం తెలిసిందే.
178 పాయింట్లతో ప్రదీప్ దొరికిపోవటంతో.. అతనికి చట్టపరమైన శిక్ష తప్పదన్న అభిప్రాయం జోరుగా సాగుతోంది. కోర్టు ఎదుట హాజరు కావటానికి ముందే.. 178 పాయింట్లతో పట్టుబడ్డ ప్రదీప్ కు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందన్న అంశంపై వార్తలు వచ్చాయి. తన మీద ఇంత భారీగా వస్తున్న వార్తల్ని చూసి ఇబ్బంది పడ్డారో.. ఇప్పుడీ హడావుడిలో కోర్టు ఎదుట హాజరైతే ఇంకేమైనా ఉందన్న ఆందోళనకు గురయ్యారో కానీ.. ఇంటికి తాళం వేసి.. ఎవరికీ అందుబాటులోకి ఉండకుండా వెళ్లిపోవటం ఇప్పుడు మరో హాట్ టాపిక్ గా మారింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రదీప్ ను వేరే వాహనంలో ఇంటికి పంపారు. ఈ నెల 2న బేగంపేట.. గోషామహల్ లో ట్రాఫిక్ సెంటర్లకు తల్లితో కానీ భార్యతో కానీ కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే.. మంగళవారం ఆయన కౌన్సెలింగ్ కు రాలేదు. దీంతో నోటీసులు అందించేందుకు బుధవారం మణికొండలోని ఆయన నివాసానికి వెళ్లగా అక్కడ తాళం వేసి ఉండటంతో అక్కడ నుంచి కూకట్ పల్లిలోని ఆయన కార్యాలయానికి వెళ్లిన పోలీసులకు అక్కడా చుక్కెదురైంది.
ఫోన్ కూడా స్విచ్చాఫ్ లో కూడా ఉండటంతో ప్రదీప్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. గురువారం కూడా కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే శాంతిభద్రతల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రదీప్ తీరు ఏమాత్రం సరికాదని.. సమస్యను మరింత పెద్దది చేసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక తప్పును కవర్ చేసుకోవటానికి మరో తప్పు చేయకూడదని.. కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంటే హాజరు కావాల్సిందే కానీ.. పరారీలో వెళ్లటం ఏ మాత్రం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. చేసిన తప్పును బుద్ధిగా ఒప్పుకుంటే శిక్ష పడొచ్చు.. లేదంటే ప్రత్యేక కారణాలతో హెచ్చరించి వదిలేయొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా ఎవరికి అందుబాటులోకి ఉండకుండా పోవటం మాత్రం కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.