Begin typing your search above and press return to search.
ప్రదీప్ కు నేడు కౌన్సిలింగ్..శిక్ష పడటం ఖాయం
By: Tupaki Desk | 1 Jan 2018 11:30 PM GMTకొత్త సంవత్సరం సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో సోమవారం తెల్లవారుజామున పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా అనూహ్య రీతిలో ఈ తనిఖీల్లో బుల్లితెర యాంకర్ ప్రదీప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖ యాంకర్ ప్రదీప్ కు పోలీసులు రేపు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్ కు రేపు హాజరుకావాల్సిందిగా అతన్ని ఆదేశించారు. సుమారు 3 గంటల పాటు ప్రదీప్ కు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఈ కౌన్స్‌లింగ్ లో భాగంగా మూడు డాక్యుమెంటరీల ప్రదర్శనతో పాటు నిపుణుల కౌన్సెలింగ్ ఉంటుందని సమాచారం. ఆ తర్వాత ప్రదీప్ ను కోర్టులో హాజరుపరుస్తారని, వారం రోజుల కంటే ఎక్కువగానే అతనికి శిక్ష పడే అవకాశముందని తెలుస్తుంది. దీంతోపాటుగా మరో కేసు ప్రదీప్ పై నమోదు అయినట్లు సమాచారం. తన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లు ప్రదీప్ తొలగించకపోవడంపై కూడా మరో కేసు నమోదైనట్టు సమాచారం అందుతుంది.
కాగా, గత రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45లో జరిగిన తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయాడు. ఓ పబ్బులో మందు కొట్టి వచ్చి తన ‘టీఎస్ 07 ఈయూ 6666’ కారులో డ్రైవింగ్ చేస్తూ బయలుదేరాడు. జూబ్లీహిల్స్ లో తనిఖీల్లో ప్రదీప్ దొరికిపోయాడు. మోతాదుకు మించి ఆయన మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించిన పోలీసులు ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడి వాహనాన్ని సీజ్ చేసి శిక్ష అమలు చేస్తారు. అయితే.. ప్రదీప్ కు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా.. 170కి పైగా పాయింట్లు నమోదయినట్లు సమాచారం.