Begin typing your search above and press return to search.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన యాంక‌ర్ ప్ర‌దీప్‌

By:  Tupaki Desk   |   1 Jan 2018 5:34 AM GMT
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన యాంక‌ర్ ప్ర‌దీప్‌
X
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మ‌రో సెల‌బ్రిటీ దొరికిపోయాడు. పోలీసులు ఎంత‌గా హెచ్చ‌రిస్తున్నా మా దారి మాదేన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ముఖుల తీరు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. సెల‌బ్రిటీలు ఒక్క‌రే కాదు.. పోలీసులు చేప‌ట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు త‌మ‌నేమాత్రం కంట్రోల్ చేయ‌మ‌న్న రీతిలో హైద‌రాబాద్ వాసులు ప‌లువురు త‌మ చేత‌ల‌తో నిరూపించారు.

కొత్త సంవ‌త్స‌రం వేళ‌.. తాగి వాహ‌నాలు న‌డిపిన వారిపై ప్ర‌త్యేక క‌న్ను ఉంటుంద‌ని.. పెద్ద ఎత్తున త‌నిఖీలు నిర్వ‌హిస్తామ‌ని.. క‌ఠిన శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని భారీగా ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అయిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చ‌రిక‌ల్ని ప‌ట్టించుకోని తీరు న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా చోటుచేసుకుంది.

బుల్లితెర మీద త‌న పంచ్ మాట‌ల‌తో న‌వ్వులు విర‌బూయిస్తూ.. సెల‌బ్రిటీగా మారిన యాంక‌ర్ ప్ర‌దీప్.. కొత్త సంవ‌త్స‌రం వేళ హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌ద్యం తాగి కారు న‌డుపుతూ దొరికిపోయాడు. బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్ లో ప్ర‌దీప్ 178 పాయింట్లు న‌మోదైన‌ట్లుగా చెబుతున్నారు.

2017కు గుడ్ బై చెబుతూ.. 2018 స్వాగ‌తం ప‌లుకుతూ నిర్వ‌హించిన వేడుక‌ల్లో పాల్గొని.. మ‌ద్యం సేవించిన ప్ర‌దీప్ కారు డ్రైవ్ చేస్తూ పోలీసులు నిర్వ‌హించిన త‌నిఖీల్లో దొరికిపోయారు. మ‌ద్యం సేవించి వాహ‌నాన్ని న‌డిపే వారికి సంబంధించి నిర్వ‌హించే బ్రీత్ అన‌లైజ‌ర్ టెస్ట్ లో 35 పాయింట్లు దాటితే కేసు న‌మోదు చేస్తున్నారు. యాంక‌ర్ ప్ర‌దీప్ 178 పాయింట్లు ఉన్న‌ట్లుగా బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్ తేల్చింది. మ‌రి.. అత‌డిపై కేసు న‌మోదు చేస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇదిలా ఉండ‌గా డిసెంబ‌రు 31 రాత్రి వేళ హైద‌రాబాద్ లోని మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్ల‌లో క‌లిపి 22500పైగా వాహ‌నాల్ని పోలీసులు త‌నిఖీలు చేశారు. ఇందులో 1600 పైగా టూవీల‌ర్స్ ను సీజ్ చేయ‌గా.. 300 కు పైగా ఆటోల్ని.. వంద‌కు పైగా ఖ‌రీదైన కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఖ‌రీదైన కార్ల‌తో పోలీస్ స్టేష‌న్లు నిండిపోయాయి. బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్ లో ప‌ట్టుబ‌డిన యాంక‌ర్ ప్ర‌దీప్ ను కారు నుంచి దించేయ‌గా..మ‌రో కారులో అత‌డు వెళ్లిపోయాడు.