Begin typing your search above and press return to search.
ప్రదీప్ కు షాక్..లైసెన్స్ రద్దు
By: Tupaki Desk | 19 Jan 2018 10:26 AM GMTప్రముఖ యాంకర్ ప్రదీప్ కు షాక్ తగిలింది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడిపిన కేసులో యాంకర్ ప్రదీప్ పై నాంపల్లి కోర్టు సంచలన చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. దాంతో పాటు రూ.2,100 జరిమానాను కోర్టు విధించింది.
డిసెంబర్ 31న మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ప్రదీప్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసును విచారించిన నాంపల్లి కోర్టు ప్రదీప్ పై చర్యలు తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రదీప్ ఇప్పటికే గోషామహల్ ట్రాఫిక్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కు హాజరైన విషయం తెలిసిందే.
అయితే కౌన్సిలింగ్ కు - కోర్టులో హాజరుకు ముందుకు ఒకింత హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందనను తెలియజేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని ప్రదీప్ తెలిపాడు. ‘ డిసెంబర్ 31 నాటి ఘటన విచారకరం. నేను డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే. తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నా. నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు. నాపై అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. ఎవరూ నమ్మవద్దు. ముందస్తుగా అంగీకరించిన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా. పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్‌కు హాజరవుతానని వీడియోలో పేర్కొన్నాడు ప్రదీప్. అనంతరం ఆయన కౌన్సిలింగ్ కు హాజరయ్యాడు.