Begin typing your search above and press return to search.
ఆ రోజు ప్రదీప్ కోర్టుకు వస్తాడట!
By: Tupaki Desk | 15 Jan 2018 10:16 AM GMTగత ఏడాది డిసెంబరు 31 రాత్రి..... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కోర్టుకు హాజరు కాని సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ నివేదిక ఆలస్యమవడంతో ఒకసారి - షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల మరోసారి తాను కోర్టుకు రాలేకపోయానని ప్రదీప్ వివరణ ఇచ్చాడు. అయితే, సామాన్యులకు ఒకలా సెలబ్రిటీలకు ఒకలా నిబంధనలు వర్తిస్తాయా అంటూ .....సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో....తాజాగా, ప్రదీప్ 22వ తేదీ సోమవారం నాడు కోర్టుకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులకు ప్రదీప్ స్వయంగా ఫోన్ చేసి తెలియజేసినట్లు సమాచారం.
వాస్తవానికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సమయం నుంచి ప్రదీప్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబరు 31న డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మిగతావారితో పాటు ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కాలేదు. ఆ తర్వాత ముందుగా బేగంపేట పోలీస్ స్టేషన్ కు హాజరవుతానని సమాచారామిచ్చి.....గోషామహల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. ఆ తర్వాతి రోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా....కౌన్సెలింగ్ నివేదిక ఆలస్యమయిందటూ సాకులు చెప్పాడు. మరుసటి రోజు షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ కోర్టుకు డుమ్మా కొట్టాడు. ఆ తర్వాత 16వ తేదీన కోర్టుకు వస్తానని ప్రదీప్ తెలిపాడు. అయితే, 16న కనుమ పండగ కావడం వల్ల కోర్టుకు సెలవని పోలీసులు తెలపడంతో 22న నాంపల్లి లోని కోర్టుకు హాజరవుతానని ప్రదీప్ చెప్పినట్లు పోలీసు వర్గాల నుంచి తెలుస్తోంది. వాస్తవానికి ప్రదీప్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ తోపాటు, కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్స్ పెట్టుకున్న కేసు కూడా ఉంది. అయితే, ప్రదీప్....22న హాజరవుతాడా? ఒక వేళ హాజరైతే అందరి లాగే ప్రదీప్ కు పరిమితికి మించిన మోతాదులో మద్యం సేవించినవారికి విధించేలా 2 రోజుల జైలు శిక్ష విధిస్తారా? లేక...ఫైన్, వార్నింగ్ తో సరిపెడతారా అన్నది ఆసక్తి కరంగా మారింది.