Begin typing your search above and press return to search.
ఎన్నికల రిజల్ట్ లో సన్ని లియోన్ ఎందుకొచ్చినట్లు?
By: Tupaki Desk | 23 May 2019 2:55 PM GMTఇప్పుడే న్యూస్ ఛానల్ చూసినా.. వెబ్ సైట్ ఓపెన్ చేసినా.. చివరికి చేతిలోఉన్న మొబైల్ ఓపెన్ చేసినా.. ఎన్నికలకు సంబంధించిన పోస్టులే భారీగా దర్శనమిస్తున్నాయి. ఇక.. సోషల్ మీడియా మొత్తం ఎన్నికల ఫలితాల చుట్టూనే తిరుగుతూనే ఉంది. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హడావుడి కాస్త ఎక్కువగా ఉంటే.. ఏపీలో మాత్రం పీక్స్ కు చేరుకున్న పరిస్థితి.
హాట్ హాట్ గా నడుస్తున్న ఎన్నికల కౌంటింగ్ వార్తల్లో అనూహ్యంగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు ఇప్పుడు చర్చకు రావటం విశేషం. లోక్ సభ ఎన్నికల ఫలితాలు లాంటి సీరియస్ అంశాల మీద డిబేట్ జరుగుతున్నప్పుడు సన్నీ లియోన్ పేరు ఎందుకు వచ్చినట్లు? ఆమె ప్రస్తావననుఎవరు తెచ్చారు? ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఎందుకు మారిందన్నది ఒకప్రశ్న అయితే.. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని సన్ని లియోన్ ఎన్నికల చర్చల్లోకి ఎందుకు వచ్చారన్నది చూస్తే.. ప్రముఖ జర్నలిస్ట్.. సెలబ్రిటీ పాత్రికేయుడిగా పేరున్న రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి నోరు జారటమే దీనికి కారణంగా చెప్పాలి.
ఒకప్పుడు మాస్ నటుడిగా పేరున్న సీనియర్ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ బీజేపీఅభ్యర్థిగా గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఈ విషయాన్ని చెప్పే క్రమంలో ఆర్నాబ్ పొరపాటున సన్నీడియోల్ పేరుకు బదులు సన్నీ లియోన్ పేరును ప్రస్తావించారు. దీంతో.. ఆర్నాబ్ టంగ్ స్లిప్ అయిన వైనంపై జోకులు పేలుతున్నాయి. మాట జారిన ఆర్నాబ్ ను సోషల్ మీడియాలో పలువురు ఏకి పారేస్తున్నారు. తన లైవ్ డిబేట్లలో రాజకీయ నేతల్ని అదే పనిగా తప్పపట్టే పెద్దమనిషి.. మరీ రీతిలో నోరుజారటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో సన్నీ లియోన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇంతకు నాకెంత మెజారట్ఈ వస్తోందంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సన్నీ డియోల్ ఎన్నికల్లో విజయం సాధించారు. నిత్యం తప్పులు ఎత్తి చూపే ఆర్నాబ్ లాంటి పాత్రికేయులు బ్యాలెన్స్ మిస్ కాకూడదు. ఒకవేళ మిస్ అయితే ఎంత నవ్వుల పాలు అవుతారో ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.