Begin typing your search above and press return to search.

ఇప్పుడు అది కరోనా ఫ్రీ ప్రాంతం

By:  Tupaki Desk   |   16 April 2020 2:05 PM GMT
ఇప్పుడు అది కరోనా ఫ్రీ ప్రాంతం
X
ప్రపంచంలో రెండు వందలకు పైగా దేశాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు మిలియన్‌ లకు చేరింది. మృతుల సంఖ్య లక్షను ఎప్పుడో దాటేసింది. ఇండియాలో కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లాక్‌ డౌన్‌ అమల్లో ఉండటం వల్ల కరోనా కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్‌ డౌన్‌ బాగానే పని చేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో కరోనా సోకిన వారంతా కూడా కోలుకున్నారు. అక్కడ మొత్తం 11 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలగా అంతా కూడా ప్రస్తుతం కోలుకుని నెగటివ్‌ కు వచ్చేశారు. కొత్తగా అక్కడ కేసులు ఏమీ లేవని.. ఇక మీదట కూడా నమోదు అవ్వవు.. ఇప్పుడు ఇది కరోనా ఫ్రీ ప్రాంతం అంటూ అండమాన్‌ నికోబార్‌ దీవుల చీఫ్‌ సెక్రటరీ చేతన్‌ సంఘి ప్రకటించారు.

ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను పాటించి లాక్‌ డౌన్‌ ను మే 3 వరకు కొనసాగించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. లాక్‌ డౌన్‌ కారణంగానే అక్కడ పూర్తి స్థాయిలో కరోనా అదుపులోకి వచ్చిందంటున్నారు. అక్కడ అధికారులు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యలు మరియు అక్కడ పాటించిన లాక్‌ డౌన్‌ విధానాలను ప్రతి రాష్ట్రంలో కూడా పాటించాలంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.