Begin typing your search above and press return to search.

అమెరికా టూరిస్టుపై బాణాలు వేసి చంపేసిన మ‌నోళ్లు

By:  Tupaki Desk   |   21 Nov 2018 10:23 AM GMT
అమెరికా టూరిస్టుపై బాణాలు వేసి చంపేసిన మ‌నోళ్లు
X
అగ్ర‌రాజ్యం అమెరికా క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం. ఇటీవ‌ల త‌న చ‌ర్య‌ల‌తో భార‌త్‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తుండ‌గా...తాజాగా ఇండియాలో జ‌రిగిన ప‌రిణామంతో ఆ దేశం ఉలిక్కిప‌డాల్సి వ‌స్తోంది. వివ‌రాల‌కు వెళితే....అండ‌మాన్ దీవుల్లో అమెరికాకు చెందిన ప‌ర్యాట‌కుడు జాన్ అల్లెన్ చాహూ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఎలా అంటే...బాణాలు వేసి. స్థానిక తెగ‌కు చెందిన ప్ర‌జ‌లు అత‌న్ని బాణాల‌తో చంపేశారు. ఈ కేసులో అండ‌మాన్ పోలీసులు ఏడు మందిని అరెస్టు చేశారు. అక్క‌డున్న జాల‌ర్లు టూరిస్టు జాన్‌ను నార్త్ సెంటిన‌ల్ దీవికి తీసుకువెళ్లారు. ఆ దీవిలో ఉన్న సెంటినేలీజ్ తెగ ప్ర‌జ‌లు ప‌ర్యాట‌కుడిని చంపి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

స్థానిక తెగ ప్ర‌జ‌లు త‌మ ద‌గ్గ‌ర ఉన్న విల్లు - బాణాల‌తో అమెరికా టూరిస్టును హ‌త్య చేసిన‌ట్లు జాల‌ర్లు తెలిపారు. టూరిస్టు జాన్ మృత‌దేహం కోసం అండ‌మాన్ పోలీసులు హెలికాప్ట‌ర్‌ తో గాలిస్తున్నారు. అయితే హెలికాప్ట‌ర్ల‌ను దీవిపై దించ‌డం లేద‌ని - ఎందుకంటే స్థానిక తెగ ప్ర‌జ‌లు ఎవ‌ర్నీ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ర‌ని పోలీసులు అన్నారు. ప్ర‌స్తుతం ఆ దీవిలో సెంటినేలేజ్ తెగ ప్ర‌జ‌లు సుమారు 50 మంది ఉంటార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉత్తర సెంటినెల్‌ ద్వీపంలో నివసించే తెగ బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడదని చెబుతున్నారు.