Begin typing your search above and press return to search.

అండమాన్ లో ఆరాచకం.. జాబ్ ఇస్తానంటూ మాజీ చీఫ్ సెక్రటరీ రేప్!

By:  Tupaki Desk   |   12 Nov 2022 4:32 AM GMT
అండమాన్ లో ఆరాచకం.. జాబ్ ఇస్తానంటూ మాజీ చీఫ్ సెక్రటరీ రేప్!
X
ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చీఫ్ సెక్రటరీగా వ్యవహరించటం అంటే మామూలు కాదు. అలాంటి అత్యుత్తమ స్థానంలో ఉన్న సీనియర్ అధికారి ఒకరు అత్యాచార ఆరోపణలు ఎదుర్కోవటం ఒక షాకింగ్ అంశం అయితే.. తాజాగా అదే అంశంలో అతగాడు అరెస్టు కావటం మరింత సంచలనంగా మారింది.

ఇంతకీ ఈ దారుణ పరిణామం చోటు చేసుకున్నదెక్కడ? అన్న విషయంలోకి వెళితే.. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ లో మాజీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జితేంద్ర సరైన్ ను తాజాగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం సైతం ఆయనకు బెయిల్ ఇవ్వకపోవటం గమనార్హం. దీంతో.. ఆయన్ను రిమాండ్ కు తరలించారు.

అండమాన్ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో.. 21 ఏళ్ల బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిఫార్సుల ఆధారంగా అండమాన్ వ్యాప్తంగా 8500 మందికి ఉద్యోగాలు ఇచ్చారని.. తనకుఅలానే వస్తుందన్న ఉద్దేశంతో తాను మాజీ చీఫ్ సెక్రటరీని సంప్రదించినట్లుగా చెప్పింది. దీంతో.. తనను కలవటానికి ఆయన ఇంటికి రావాల్సిందిగా కోరితే తాను వెళ్లానని చెప్పింది.

మాజీ చీఫ్ సెక్రటరీ ఇంటికి వెళ్లిన తర్వాత.. ఆయనతో పాటు మరికొందరు అధికారులు తనను సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లుగా పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో జితేంద్ర నరైన్ ను తాజాగా అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు.. ఆయన్ను రిమాండ్ కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తనను కుట్రపూరితంగా ఇరికించినట్లుగా నరేన్ చెబుతున్నారు. కీలక స్థానంలో ఉన్న ముఖ్య అధికారిపై వచ్చిన ఈ షాకింగ్ ఆరోపణ.. తదనంతర పరిణామాలు అండమాన్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.