Begin typing your search above and press return to search.
కేంద్రమంటే అంత భయమెందుకు?
By: Tupaki Desk | 3 March 2018 5:37 AM GMTతెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు కేంద్రమంటే ఎందుకో భయం కనిపిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ కొంత నయమని ఇంతవరకు అనుకునేవారు, తాజాగా తెలంగాణ విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజుల్లో జరిగిన రెండు పరిణామాలను గమనిస్తే కేంద్ర ప్రభుత్వంలోని వ్యక్తులకు - ప్రభుత్వంలో లేకపోయినా అక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీలో పెద్దలను చూసి ఇక్కడి నేతలు హడలుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్ తరువాత ఏపీకి అన్యాయం జరిగిందంటూ అధికార టీడీపీ రంకెలేసింది. బీజేపీతో పొత్తు తెగిపోతుందన్నంతగా హడావుడి చేశారు. అయినా, కేంద్రం కదిలింది లేదు - విదిలించింది లేదు. దాదాపు నెల కావస్తున్న దానిపై అడుగు ముందుకు పడలేదు. మళ్లీ 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ఉండడంతో టీడీపీ హడావుడి మొదలుపెడుతోంది. అయితే.. టీడీపీ పార్లమెంటులో గొడవ చేయబోతోందని అర్థం చేసుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేశారు. మోదీ - అమిత్ షాలను కలవడానికి - వారితో మాట్లాడడానికి పాపం ఎంతగానో వెయిట్ చేయాల్సి వస్తున్న చంద్రబాబు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి... అమిత్ షాను చెడామడా కడిగి పారేయాలి. తమ డిమాండ్లను వినిపించాలి.. రాష్ట్రం కోసం ఏమైనా చేస్తామని చెప్పగలగాలి... కానీ, చంద్రబాబు చేసిందేమిటి..? ‘మా పోరాటం బీజేపీపై కాదు.. ఏ పోరాటమైనా ప్రజల కోసమేనని, అలాగే విభజన హామీలపై కూడా పోరాటం చేస్తున్నాం’’ అంటూ ముందే సరెండర్ అయిపోయారు. అంటే... తమ పార్టీ నేతలు ఆందోళనలు చేసినా, నిరసనలు తెలిపినా అది మీకు వ్యతిరేకంగా కాదు, దయచేసి తప్పుగా భావించొద్దు అని చెప్పినట్లయింది. అంతా ఉత్తుత్తినే అని చెప్పాక ఇంకేముంటంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే... కేంద్రంతో ఇప్పటికే మంచి సంబంధాలు నెరుపుతున్న సీఎం కేసీఆర్ రీసెంటుగా రైతు సమన్వయ కమిటీల సమావేశాల్లో మాత్రం రాజకీయ లక్ష్యాల ప్రకారం రూటు మార్చారు. బీజేపీని విమర్శించారు.. చివరికి ప్రధాని మోదీని కూడా తీవ్ర ఏకవచనాలతో సంబోధిస్తూ విమర్శలు చేశారు. కేసీఆర్‌కు ఇలాంటివి కొత్తేమీ కాదు.. అయితే.. ట్విస్టేంటంటే.. అది జరిగిన రెండు రోజులకే ఆదిభట్లలో హెలికాప్టర్ యూనిట్ ప్రారంభానికి రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ రావాలి. కానీ, ఆమె వచ్చే ముందు కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేసి మీరు ప్రధానిని ఇంతగా తిడుతున్నాక నేనెలా వస్తానని అన్నారు. దాంతో కేటీఆర్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.. కేసీఆర్ పొరపాటున నోరు జారారని - అవేమీ మనసులో పెట్టుకోకుండా ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి రావాలని అభ్యర్థించారట. దీంతో విమర్శలు చేయడమెందుకు - వణికిపోవడమెందుకు? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా, ఏం చేసినా అదంతా నటనేనని జనం అంటున్నారు.