Begin typing your search above and press return to search.
కేసీఆర్ వాత పెడితే.. బాబు స్పీటు పెట్టారే
By: Tupaki Desk | 29 Jun 2016 4:35 PM GMTవిభజన తర్వాత నుంచి ఏపీ.. తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వివిధ అంశాల్లో పోటీ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇది రాజకీయ నేతల మధ్యనే కాదు.. అధికారులు.. వివిధ శాఖల మధ్యన కూడా. రెండు రాష్ట్రాల మధ్యన పోటీ ఎంతలా ఉందంటే.. టెన్త్.. ఇంటర్.. ఎంసెట్ పరీక్షా ఫలితాల్ని విడుదల చేసే విషయంలో ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ఆయా శాఖలు ఎంత పోటాపోటీగా పని చేశాయో ఆయా బీట్లు చూసే జర్నలిస్టులకు బాగా తెలుసు.
అంతదాకా ఎందుకు.. ఈ మధ్యనే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. సంపన్న రాష్ట్రంగా పేర్కొనే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు పెంచటమా? అంటూ పలువురు పెదవి విరిచారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము చార్జీలు పెంచటానికి కొద్ది నెలల ముందే ఏపీ ఆర్టీసీ కూడా చార్జీలు పెంచిందని.. వారు పెంచిన ఛార్జీలతో పోలిస్తే.. తమ ఛార్జీలు కిలో మీటరుకు పైసా తక్కువ ఉన్నట్లు గొప్పలు చెప్పుకొన్నారు.
సంపన్న రాష్ట్రం ఛార్జీలు పెంచటమే ఎక్కువైతే.. అప్పుల కుప్ప అయిన ఏపీ కంటే కిలోమీటరుకు కేవలం పైసానే తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు తక్కువగా చెప్పుకోవటం పలువురిని విస్మయానికి గురి చేసింది. రెండు రాష్ట్రాల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందనటానికి ఇదో నిదర్శనం. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ఆర్టీసీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు ఛార్జీల్లో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ ఆఫర్ దూర ప్రాంతాల ప్రయాణాలకు కూడా ఇవ్వాలని ప్రకటించింది. అయితే.. సీనియర్ సిటిజన్ అన్న ధ్రువపత్రం తమ ప్రయాణ సమయంలో చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. తాజాగా ఏపీ ఆర్టీసీ ప్రకటించిన రాయితీ ఆఫర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సంపన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనాలకు వాతలు పెడితే.. అప్పుల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా సీనియర్ సిటిజన్లకు భారీ ఆఫర్ ప్రకటించారన్న మాట వినిపిస్తోంది. మరి.. తాజా ఏపీ ఆర్టీసీ ఆఫర్ కు తెలంగాణ ఆర్టీసీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.