Begin typing your search above and press return to search.
హైకోర్టు విభజన..ఏపీ - తెలంగాణ న్యాయవాదుల కన్నీరు
By: Tupaki Desk | 31 Dec 2018 6:59 AM GMTరాజకీయ కారణాలు - సెంటిమెంట్ - ప్రత్యేక కోర్టులు... వంటివి ఎన్నున్నా నిన్నటి వరకూ కలిసిమెలిసి వున్న తెలంగాణ - ఆంధ్రా లాయలు - సిబ్బంది నేడు ఒకరిని ఒకరు విడిచి వెళ్లిపోతున్న వేళ ఆవేదనకు లోనవుతున్నారు. కొందరైతే కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆంధ్రాలాయర్లు - సిబ్బంది - న్యాయమూర్తులకు తెలంగాణ న్యాయమూర్తులు, ఉద్యోగులు శుభాకాంక్షలు చెబుతూనే ఇంతకాలం తమ మధ్య అనుబంధాలను గుర్తుచేసుకుని కంటతడి పెడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజనకు కేంద్రం - సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం - రేపటి నుంచి అమరావతి - విజయవాడలో కోర్టు సేవలను నిర్వహించాల్సి వుండటంతో హైదరాబాద్ నుంచి తరలిపోతున్నారు. న్యాయవాదులు - సిబ్బంది - టన్నుల కొద్దీ ఫైళ్లను అమరావతికి తరలించేందుకు ఈ ఉదయం అఫ్జల్ గంజ్ సమీపంలోని హైకోర్టుకు బస్సులు - లారీలు చేరుకోగా - తరలింపు ప్రక్రియ మొదలైంది. ఈ బస్సులు - లారీలు నేటి రాత్రికి విజయవాడకు చేరుకోనున్నాయి. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ సహా - పలు భవనాలను తాత్కాలిక హైకోర్టు భవనాలుగా ఏపీ సర్కారు నిర్ణయించింది.
కాగా చాలాకాలంగా హైకోర్టు విభజనపై రగడ జరుగుతుండగా ఇప్పుడు కూడా దీనిపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ - ఏపీల్లోని పాలక పక్షాల నేతల మధ్య దీనిపై ఆరోపణలు - ప్రత్యారోపణలు సాగుతున్నాయి. అయితే.. సిబ్బంది మాత్రం అన్నీ మరచి వీడ్కోలు చెప్పుకొంటూ భావోద్వేగాలకు గురవుతున్నారు.