Begin typing your search above and press return to search.

ఆ మూడు గంటల రెస్ట్‌ కూడా ఎందుకో..?

By:  Tupaki Desk   |   26 Jun 2015 6:25 AM GMT
ఆ మూడు గంటల రెస్ట్‌ కూడా ఎందుకో..?
X
కొన్ని విషయాల్లో ఎన్ని అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ.. ఒకనాటి గురుశిష్యుల పాలన చాలావరకూ ఒకటిగా ఉండటం విశేషం. ప్రత్యేకించి కొన్ని విషయాల్లో వీరి ఆలోచనలు.. నిర్ణయాలు ఇంచుమించు ఒకేలా ఉండటం గమనార్హం.

తెలంగాణలోని మద్యం పాలసీ కానీ.. ఏపీలోని మద్యం పాలసీలో చాలావరకు ఒకేలా ఉండటం విశేషం. ఎన్నికల సమయంలో పరిమితుల మేర మాత్రమే మద్యం ఉంటుందని.. తమ ప్రభుత్వం మద్యపానాన్ని ప్రోత్సహించదన్న మాటను చంద్రబాబు చెప్పారు. కానీ.. తాజాగా సర్కారు మద్యం పాలసీ చూస్తే.. షాపింగ్‌మాల్స్‌ (భారీ) లో సైతం మద్యం అమ్మకాలకు సంబంధించిన ప్రతిపాదన ఇవ్వటం తెలిసిందే.

ఇక.. తెలంగాణ సర్కారు అయితే.. స్టార్‌ హోటళ్లు.. పెద్దపెద్ద రెస్టారెంట్లలో మద్యం అమ్మకాల్ని ఉదయం 6 గంటలకు మొదలు పెట్టి.. తెల్లవారుజామున మూడు గంటల వరకూ అమ్ముకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విధానాన్ని చూస్తే.. రోజు మొత్తంలో మూడు గంటల మినహా మిగిలిన అన్నీ సమయాల్లోనూ మద్యం లభించే పరిస్థితి.

వాస్తవానికి రోజు మొత్తం మద్యం అమ్మకాలు ఉండేలా నిర్ణయం తీసుకోవాలని భావించినా.. అది విమర్శలకు తావిస్తోందన్న సందేహంతో ఒక మూడు గంటల పాటు విరామం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అధికారికంగా 21 గంటల పాటు మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపేసిన నేపథ్యంలో.. విరామం ఇచ్చిన మూడు గంటలు కూడా మద్యం అలా ప్రవహించేస్తుందన్న మాట వినిపిస్తోంది. అయినా.. 21 గంటల అమ్మకాలకు ఓకే చెప్పినోళ్లు.. రోజులో మిగిలిన మూడు గంటలు కూడా రెస్ట్‌ ఇవ్వటం ఎందుకు..?