Begin typing your search above and press return to search.
రామోజీని పద్మవిభూషణ్ కు సిఫార్సు చేసిందెవరు?
By: Tupaki Desk | 26 Jan 2016 4:31 AM GMTమీడియా మొఘల్ రామోజీరావు ఇకపై పద్మవిభూషణ్ అన్న పదాన్ని తన పేరు ముందు పెట్టుకోనున్నారు. భారతరత్న తర్వాత రెండో అత్యున్నత పురస్కారమైన ఈ పురస్కారాన్ని రామోజీకి ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మీడియా.. చలనచిత్రం.. టూరిజం రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చినందుకు రామోజీకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు.
అయితే.. పద్మవిభూషణ్ కు రామోజీని సిఫార్సు చేసింది? ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మరింది. ప్రశ్నకు తగ్గట్లే.. దాని సమాధానం మరింత ఆసక్తికరంగా ఉండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారానికి సిఫార్సు చేయటం విశేషంగా చెప్పాలి. తనను ఎంపిక చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు రామోజీ థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటన చూస్తే.. రామోజీని రెండు తెలుగు రాష్ట్రాలు సిఫార్సు చేసినట్లుగా కనిపిస్తోంది. ఏమైనా ఒక వ్యక్తికి అత్యున్నత పురస్కారం ఇచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి సిఫార్సు చేయటం చిన్న విషయమేమీ కాదు.
రాష్ట్ర విభజన తర్వాత ఒకే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే మాట మీద నిలబడి ఉండటం ఇదేనేమో. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం రామోజీరావుకు మాత్రమే చెల్లుతుందేమో..? మీడియా మొఘల్ అనే మాటకు ఆయనకు అతికినట్లుగా ఉంటుందనటంలో సందేహం లేదు.