Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ పై తెలుగు రాష్ట్రాల భిన్నాభిప్రాయాలు
By: Tupaki Desk | 8 April 2020 4:30 PM GMTకరోనాను కట్టడి చేయడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్ 14లో ముగియనుందా? లేదంటే లాక్ డౌన్ ను పొడిగాస్తారా? ప్రస్తుతం ఈ రెండు ప్రశ్నలపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నానాటికీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపుకే మెజారిటీ రాష్ట్రాలు మొగ్గుచూపుతుండగా...కొన్ని రాష్ట్రాలు మాత్రం దశల వారీ లాక్ డౌన్ పై ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ పార్టీల నేతలతో ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కూడా లాక్ డౌన్ కొనసాగింపు పైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కొనసాగించడమే నయమన్న భావనలో మోడీ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై రెండు తెలుగు రాష్ట్రాలు రెండు భిన్నమైన వాదనలు వినిపించడం విశేషం. లాక్ డౌన్ కొనసాగించేందుకు తెలంగాణ ఫ్లోర్ లీడర్లు మొగ్గుచూపుతుండగా రాష్ట్రంలోని హాట్ స్పాట్ లలో లాక్ డౌన్ కొనసాగిస్తూ...మిగతా ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్లు అభిప్రాయపడ్డారు.
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఏపీ - తెలంగాణల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇరు ప్రభుత్వాలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించుకున్నాయి. చాలా విషయాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయి. అయితే, లాక్ డౌన్ విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల దారి ..ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. తాజాగా మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు టీఆర్ ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు - లోక్ సభలో టీఆర్ ఎస్ పక్షం నేత నామా నాగేశ్వర రావు హాజరయ్యారు. వైసీపీ తరపున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి - లోక్ సభలో వైసీపీ పక్షనేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. లాక్ డౌన్ కనీసం మరో రెండు వారాలు కొనసాగించాలని టీఆర్ ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. కరోనా ప్రభావం అంతగా లేని చోట్ల లాక్ డౌన్ ఎత్తివేయాలని వైసీపీ నేతలు చెప్పారు. అంతేకాదు, కరోనా హాట్ స్పాట్లలో లాక్ డౌన్ కొనసాగిస్తూ.. కరోనా ప్రభావం లేని చోట్ల కొన్ని నిబంధనలతో కూడిన సాధారణ పరిస్థితులు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో హైదరాబాద్ - నిజామాబాద్ - కరీంనగర్ - వరంగల్ జిల్లా కేంద్రాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల్లో కొద్దిగా మాత్రమే ఉంది. రబీ పంట దిగుబడులు చేతికి వచ్చే సమయంలో రూరల్ ఏరియాలో లాక్ డౌన్ ఎత్తివేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. విదేశీ ప్రయాణాలు - స్వదేశీ ప్రజా రవాణా లేవు కాబట్టి ఆంక్షలతో కూడిన మార్కెట్ సౌకర్యాలను కల్పించాలని సామాజిక వేత్తలు సలహాలిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎకానమీని కొంత మెరుగుపరచవచ్చని - వ్యాపారంతోపాటు సామాన్యులకు ఉపాధి సౌకర్యాలను రీస్టోర్ చేయవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా...ఏప్రిల్ 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచిన తర్వాతే లాక్ డౌన్ ఎత్తివేతపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.