Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలపై రైల్వే శఠగోపం
By: Tupaki Desk | 25 Feb 2016 8:53 AM GMTయూపీఏ ప్రభుత్వానికి తామేమీ తీసిపోమని ఎన్టీఏ సర్కారు కూడా రుజువు చేస్తోంది. గత ఏడాది తొలి రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిన మోడీ ప్రభుత్వం ఈసారి కూడా అదే రీతిలో వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాలు ఆశించిన ప్రాజెక్టులు కానీ.. కోరుకున్న నిధులు కానీ ఏమీ ఇవ్వకుండా మొండి చేయి చూపించారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు.
* విశాఖపట్నాన్ని ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటిస్తారని గత ఏడాదే ఆశ పడి నిరాశ చెందిన ఆంధ్రప్రదేశ్ కు ఈసారి కూడా చేదు అనుభవమే ఎదురైంది. విశాఖను ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటించలేదు రైల్వే మంత్రి.
* తెలుగు రాష్ట్రాలకు కొత్తగా రైళ్లు కూడా ఏమీ ప్రకటించలేదు. కొత్త లైన్ల ప్రకటన కూడా లేదు.
* తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏళ్లుగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు కూడా నిధులేమీ ప్రకటించలేదు.
* కాజీ పేటలో కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన కూడా తేలేదు
* విభజన సందర్భంగా ఇచ్చిన ఏ హామీలనూ పట్టించుకోలేదు.
* చంద్రబాబు కోరినట్లు అమరావతిలో రైల్వే యూనివర్శిటీ కానీ.. ఇంకే విజ్నప్తుల్ని కానీ కేంద్రం పట్టించుకోలేదు.