Begin typing your search above and press return to search.
తెలుగురాష్ట్రాల అప్పుల తిప్పలు!
By: Tupaki Desk | 5 Aug 2018 5:30 PM GMTతెలుగు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. సమైక్యంగా ఉన్నప్పటి కంటే రెండుగా విడిపోయిన ఈ నాలుగేళ్లలో అప్పుల భారం ఎక్కువవుతోంది. రాష్ట్రం రెండుగా విడిపోతే రాబడి పెరుగుతుంది... అభివ్రద్ధి సాధిస్తామన్న వారు నేటి దీనస్థితికి ఏం చెబుతారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అప్పులకు తగినట్లుగా కాసింత అభివృద్ధి కనిపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసలు అభివ్రద్ధే కనిపించడం లేదు. తెలంగాణాలో పెట్టుబడులు వస్తున్నాయి. దీని ద్వారా ఉద్యోగ - ఉపాధి అవసరాలు తీరుతున్నాయి. తెలంగాణలో అప్పుల పరిస్థితిపై ప్రతిపక్షాలు - మేథావులు కూడా మండిపడుతున్నారు. కేంద్రం నుంచి - వివిధ ఆర్ధిక సంస్ధల నుంచి కోట్లాది రూపాయలు అప్పులు తీసుకొస్తున్నా రాష్ట్రం వడ్డీ రూపంలో చాలా నష్టపోతోందని - ప్రభుత్వంలో ఎవరికి జవాబుదారీతనం లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తలకు మించిన భారాన్ని మోయడం లేదని - అభివృద్ధి కి తగిన అప్పులనే చేస్తూ దాన్ని తీర్చుకుంటోందని వాదిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు రాబడి ఎక్కువని, దాని వల్లే అప్పులు చేసినా రాష్ట్రానికి ఇబ్బందులు రావనేది ప్రభుత్వ వాదన.
తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులకు దారీ తెన్ను లేకుండా పోయిందని విమర్శలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోజు వారీ ఖర్చులకు కూడా ప్రభుత్వం అప్పులు చేయడం, వాటి నుంచి బయటపడే మార్గం కూడా కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ఆర్ధిక మంత్రి యనమల రామక్రష్ణుడు యదేచ్చగా ఖర్చు చేస్తున్నారని - దీనికి ఎక్కడా అంతు లేకుండా పోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రెండు నెలలకొకసారి పెట్టుబడుల పేరుతో తన మందీ మార్బలంతో చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలకు వెళ్లడం కూడా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో అభివ్రద్ది పేరుతో విధ్వంసం చేస్తున్నారని, ప్రభుత్వం చేసే ఖర్చులన్నీ నిరుపయోగంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ లోని మేథావులు - ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. అప్పుల రూపంలో తీసుకువస్తున్న లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి నుంచి బయటపడడం చాలా కష్టమని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ముందు చూపు లేకుండా చేస్తున్న అప్పుల కారణంగా భవిష్యత్ లో కష్టాలు తప్పవని అంటున్నారు. కేంద్రంతో కూడా పొసగని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడి నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదు. దీంతో రానున్న రోజుల్లో రాష్ట్రానికి వచ్చే ఆదాయమంతా వడ్డీలు కట్టేందుకే సరిపోతుందని అంటున్నారు.