Begin typing your search above and press return to search.
బాబు ఎన్నికల జిమ్మిక్కులు...
By: Tupaki Desk | 2 Aug 2018 5:05 PM GMTచంద్రబాబు నాయుడి గారడీ ప్రారంభమైంది. చంద్రబాబునాయుడి ఎన్నికల తాయిలాల పంపిణీ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడి అధికార నిచ్చెనకు ఎన్నికల మెట్లు వేసుకోవడం ఆరంభమైంది. అధికారమే పరమావధిగా పావులు కదపడం ప్రారంభమైంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది గడువు ఉండడంతో ఆయన ఇప్పటి నుంచే ఓటర్ల ఆకర్షకు తలుపులు తీస్తున్నారు. ఎన్నికల ముందు బాబు వస్తే.. జాబు గ్యారంటీ అంటూ ఊదరగొట్టి నిరుద్యోగులకు ఆశలు రేకెత్తించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం వచ్చే సరికి ప్లేటు ఫిరాయిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు గ్యారంటీ అని, కొత్త పరిశ్రమలతో ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నమ్మబలికారు. తీరా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాల మాటే మరిచారు.
బాబు వస్తే... జాబు గ్యారంటీ...ని అటకెక్కించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు తన ప్రయత్నాలు - కుట్రలు - రాజకీయ ఎత్తుగడలకు ద్వారాలు తెరిచారు. దీనికి గురువారం నాటి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశమే వేదిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు భ్రతి ఇస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యువనేస్తం అని ఈ పథకానికి పేరు కూడా పెట్టారు. నాలుగేళ్లుగా లేని ఈ కొత్త యువనేస్తం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారని ఈ పథకం గురించి టీవీల్లో చూసిన వారు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా బ్యాంకుల్లో వారి వారి ఖాతాల్లో వెయ్యి రూపాయలు పడతాయని మంత్రి నారా లోకేష్ మంత్రివర్గం సమావేశం అనంతరం చెప్పారు. ప్రజాసాధికారిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులున్నారని - వారికి ప్రతి నెలా 640 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యువనేస్తం పథకం అమలు చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రం విడిపోవడానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో ఐదారు లక్షల మందికి మించి నిరుద్యోగులు లేరని ఓ సర్వే పేర్కొంది.
ఈ నాలుగేళ్లలోనూ ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదన్నమాట. ఇక ఫించన్ పథకం ఇంటిలో ఒకరికే ఇస్తున్నామని, ఈ యువ నేస్తం మాత్రం ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అందరికీ ఇస్తాం అని ప్రకటించారు. అంటే ఈ నాలుగేళ్ల కాలంలో ఇంటిలో ఒకరికి మించి నిరుద్యోగులు ఉన్నారంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా బాబు వస్తే... జాబు గ్యారంటీ ఏ దశలోనూ అమలు కాలేదనే అర్ధం కదా...!? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో యువకులను ఉద్యోగులుగా మార్చాలని, ఆ తర్వాత వారిని, వారి కుటుంబాలను ప్రయోజకులుగా చేసేందుకు ప్రభుత్వాలు సహకరించాలి కాని... ఇలా నిరుద్యోగ భృతి పేరుతో వారుని వంచించడం తగదని అంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎన్నో వస్తున్నాయని మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి లోకేష్ చెప్పారు. అదే నిజమైతే ఆయా కంపెనీలలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేయాలి కాని, నెలకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
గురువారం నాడు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో విశాఖ మెట్రో రీజియన్ ను 5,573 చదరపు కిలోమీటర్ల నుంచి 6,764 చదరపు కిలోమీటర్లకు పెంచారు. ఇందులో కూడా కుట్ర కోణం దాగి ఉంది. ప్రభుత్వం పెంచిన ఈ పరిధి కారణంగా అధికార పార్టీకి చెందిన వారు విశాఖ చుట్టు పక్కల కొనుగోలు చేసిన భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇక్కడ భూములున్న వారిలో తెలుగుదేశం పార్టీ మంత్రులు... శాసనసభ్యులు... నాయకులు ఉన్నారని వేరే చెప్పాలా... !?