Begin typing your search above and press return to search.
బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ చేసిన జగన్
By: Tupaki Desk | 2 July 2019 4:37 AM GMTకొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో ఏపీ కొత్త సర్కారు బడ్జెట్ ప్రవేశ పెట్టటానికి వీలుగా డేట్ ఫిక్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జులై వరకు ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టటం తెలిసిందే. దీనికి ఆమోదం తెలిపారు.
తాజాగా జగన్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ను తొలిసారి ప్రవేశ పెట్టనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోంది. తాను ఎన్నికల వేళ హామీ ఇచ్చిన నవరత్నాలను అమలు చేసే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాన్ని ఈ నెల 11 నుంచి నెలాఖరు వరకూ నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.
దీనికి సంబంధించిన ఫైలుకు జగన్ ఓకే చెప్పటంతో ఇప్పుడిది రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వద్దకు చేరింది. దీనిపై ఆయన ఆమోద ముద్ర వేసిన వెంటనే.. అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వచ్చే మార్చి చివరి వరకూ అవసరమయ్యే బడ్జెట్ ను జగన్ ప్రవేశ పెట్టనున్నారు.
జగన్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతాయి. 12న బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడతారు. దీనికి సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టే తొలి బడ్జెట్ లోనే తమ మార్క్ కొట్టొచ్చినట్లు ఉండేలా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం.