Begin typing your search above and press return to search.
ఏపీలో అసెంబ్లీ నిర్వహణ....మళ్లీ వెనక్కు
By: Tupaki Desk | 25 Nov 2016 6:05 AM GMTకొన్ని నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గుర్తుండే ఉంటుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లో జరగడం అదే చివరిసారి అని అంతా భావించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనమండలిలో ఉద్వేగపూరితంగా మాట్లాడారు. దీంతో వచ్చే అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా కొత్త రాజధాని అమరావతిలో నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ వెలగపూడిలో నిర్వహించడం గతంలో వలే..మళ్లీ ప్రశ్నార్ధకమై తిరిగి హైదరాబాద్ లో పూర్తిచేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గుచూపుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలోనే ఈ తంతు జరపాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జీఎస్టీ బిల్లులో ప్రతిపక్షాల సూచనల మేరకు కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే రాష్ట్రాల అసెంబ్లీల రాజ్యాంగ సవరణ తీర్మానాలు చేసినప్పటికి పార్లమెంటు ఆమోదం పొందితే బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే శీతాకాల సమావేశాలు తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ అందుబాటులోకి రావడం-తాజా పరిస్థితులపై సమీక్షించాలని ఏపీ ముఖ్యమంత్రి నిర్ణయించారు. అసెంబ్లీ - శాసనమండలి భవనం డిజైన్ల ఖరారులో జరిగిన జాప్యం ఫలితంగా పూర్తి స్థాయిలో భవనం అందుబాటులోకి రాలేదని తేలింది. దీంతో సంపూర్ణంగా కొత్త ప్రాంగాణాన్ని వినియోగించుకోవాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిన పరిస్థితి అనివార్యమైంది. వెలగపూడిలో సచివాలయ భవనాలతో పాటు ఆరవ భవనంగా నిర్మిస్తున్న ఏపీ అసెంబ్లీ, ఏపీ శాసనమండలి భవన నిర్మాణం తుది దశకు వచ్చింది. కానీ ఇంటీరియర్ పనులేమి ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలతో పడింది. డిసెంబరు ఆఖరు నాటికి అసెంబ్లీ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం మరో వైపు జనవరి మొదటి వారం శీతాకాల సమావేశాలు నిర్వహించే వెసులుబాటు ఉంది. అయినప్పటికి పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తయ్యే సరికి మరో రెండు నెలల సమయం తప్పదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ మళ్లీ హైదరాబాద్ లోనే జరపక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో కొత్త అసెంబ్లీ ఇక బడ్జెట్ సమావేశాలకే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుత శీతాకాల సమావేశాలు మాత్రమే హైదరాబాద్‌లోనే నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. వెలగపూడిలోని నూతన అసెంబ్లీ భవనాలు సిద్దం కావడానికి మరో రెండు నెలల సమయం పట్టనున్న నేపధ్యంలో ఒకేసారి బడ్జెట్ సమావేశాలు నిర్ణయించాలని ప్రభుత్వం భావించింది.
ఇదిలా ఉండగా స్పీకర్ కొడెల శివప్రసాదరావు మాత్రం శీతాకాల అసెంబ్లి సమావేశాలను మాత్రం సొంత రాష్ట్రంలోనే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. నిర్దేశించిన గడువులోగా భవనాల నిర్మాణాలు పూర్తి కాని పక్షంలో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయంతో స్పీకర్ ఉన్నట్లు సమాచారం. డిసెంబరు 15వ తేదీలోగా అసెంబ్లి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం ఆ సూచనలు అమలయ్యే పరిస్థితులు లేకపోవడంతో కేఎల్ యూనివర్సిటీలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దిశగా స్పీకర్ కొడెల శివప్రసాదరావు కసరత్తు ప్రారంభించారని సమాచారం. కేఎల్‌యూనివర్సిటీ భవనం అసెంబ్లి సమావేశాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని ఒక ప్రతిపాదన ఉన్నప్పటికి ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి హైదరబాద్‌లోని అసెంబ్లికి గుడ్ బై చెప్పిన తరువాత మళ్లి అసెంబ్లి సమావేశాలు నిర్వహించడం సబబుకాదనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి - స్పీకర్ సమిష్టిగా నిర్ణయం తీసుకుని సస్పెన్స్ కు తెరదించే అవకాశాలున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/