Begin typing your search above and press return to search.
అందరి చూపు...అసెంబ్లీలో జగన్ లాబీ వైపే
By: Tupaki Desk | 10 Nov 2017 7:55 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇవి షరామామూలు సమావేశాలేం కావు. ఈ సమావేశాలు ఓ ప్రత్యేకత...ఇంకా చెప్పాలంటే..రికార్డు కూడా ఉంది....అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదలుకొని ఈనాటి వరకూ ప్రతిపక్షపార్టీ లేకుండా జరుగుతున్న మొట్ట మొదటి శాసనసభ సమావేశాలుగా చరిత్రను సృష్టించడం. అధికార– ప్రతిపక్షపార్టీల మధ్య ఎలాంటి వాగ్వివాదాలు -మాటల యుద్ధం లేకుండా శాసనసభ సమావేశాలు ఏకపక్షంగానే జరగనుండటం!
శాసనసభ శీతాకాల సమావేశాలకు తాము హాజరు కావడంలేదని ప్రతిపక్షపార్టీ నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పదిరోజుల క్రితం ప్రకటించి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. అంతే కాకుండా తాను ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని చెప్పి ఈనెల 6వ తేదీ నుండి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీఎస్టీ బిల్లు ఆమోదానికి శానసభను నిర్వహించి 15వ తేదీకి ఆరు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ వ్యవహారాల నియమ నిబంధనల ప్రకారం సభను తప్పక నిర్వహించాల్సి ఉంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభను నిర్వహించడానికే మొగ్గు చూపారు. అయితే తొలిరోజు అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడంతో అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహనరెడ్డి లాబీతోపాటు వైసీపీ శాసనసభాపక్ష సమావేశ మందిరం బోసిపోయింది. అధికారులతోపాటు సిబ్బంది కూడా అటువైపు చూడకపోవడంతో లాబీ మొత్తం నిర్మానుష్యంగా మారింది.
సాధారణంగా అసెంబ్లీ సమా వేశాలు ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచే అసెంబ్లీలో హడావుడి మొదలవుతుంది. గేట్ పాసులు అందజేయడం - లాబీలను సిద్ధం చేయడంతో హడావుడి ప్రారంభమవుతుంది. గదులు - స్టేషనరీ సిద్ధం చేయడం అంతా హడావుడీగా సాగుతుంది. అయితే ఈ సారి అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో వైసీపీ లాబీలు మినహా అన్ని లాబీల్లో సిబ్బంది హడావుడిగా కనిపించింది. సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజు వైసీపీ శాసనసభాపక్ష కార్యక్రమం వద్ద సందడి లేకపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే ఈ పరిణామం కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను సైతం ఆలోచనలో పడేసింది.
అంశాల వారీగా ప్రతిపక్షం వాకౌట్ చేయడం అనేది సహజమని పేర్కొంటూ...ఏకంగా అసెంబ్లీ సమావేశాల నుంచే ప్రధాన ప్రతిపక్షం వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందంటే రాజకీయాల పరంగా తాము ఇరకాటంలో పడే పరిస్థితే అని టీడీపీ ఎమ్మెల్యే ఒకరిద్దరు అసెంబ్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్న సమయంలో తెలిపారు. ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపచేసి వారికి మంత్రి పదవులు ఇచ్చిన ఉదంతంలో...తమ విధానాన్ని పలువురు ప్రశ్నిస్తున్న నేపథ్యం ఉండగా...ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభను నడుపుకోవడం అనేది రాబోయే కాలంలో ఇరకాటంలో పడేసేదిగా మారుతుందని అంచనా వేశారు.