Begin typing your search above and press return to search.
బీఏసీ మీటింగ్ లోనే లొల్లి మొదలైంది
By: Tupaki Desk | 31 Aug 2015 5:05 AM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తాజాగా మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగటం ఖాయమన్న అంచనాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సమావేశాలు స్టార్ట్ కాక ముందే.. అధికార.. విపక్షాల మధ్య లొల్లి మొదలైంది.
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్ని ఐదు రోజులు నిర్వహించాలని ఏపీ అధికారపక్షం నిర్ణయించగా.. అందుకు భిన్నంగా అసెంబ్లీ సమావేశాల్ని 15 రోజుల పాటు నిర్వహించాలని విపక్ష నేతలు పట్టుపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే బీఏసీ సమావేశంలో అధికార.. విపక్ష నేతల మధ్య.. ఈ అంశంపై వాదన చోటు చేసుకుంది.
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తాను విపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్ని వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని చంద్రబాబు అప్పట్లో కోరేవారు. ఆయన వాదనను ఖండిస్తూ.. అన్ని రోజులు అవసరం లేదని.. నాటి ముఖ్యమంత్రులు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డిలు త్రోసి పుచ్చేవారు.
అసెంబ్లీ సమావేశాలు వీలైనన్ని ఎక్కువరోజులు జరగాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు స్వయంగా అధికారంలో ఉన్నారు. అయినా.. ఆయన సమావేశాల్ని స్వల్ప కాలానికి పరిమితం చేయటం గమనార్హం. వర్షాకాల సమావేశాలు పది రోజులు జరిగినా బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. బాబు సర్కారు మాత్రం ఐదు రోజులకే పరిమితం చేయటం చూస్తే.. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. విపక్షంలో ఉన్నప్పుడు మరోమాట అన్నది నేతలకు కామన్ అని అనిపించక మానదు.