Begin typing your search above and press return to search.
ఆంధ్రాబ్యాంకు ఎంత క్లియర్‌గా చెప్పింది
By: Tupaki Desk | 20 Jan 2015 7:37 AM GMTఅదేం చిత్రమో కానీ.. రెండు తెలుగురాష్ట్రాల మధ్య లల్లి జరగని అంశం అంటూ ఉండదు. ప్రతి విషయంలోనూ సమస్యలు బయటకు వస్తుంటాయే కానీ.. వాటికి పరిష్కారాలు మాత్రం దొరకనే దొరకవు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అస్సలు పట్టించుకోరు. పట్టించుకోవాల్సి ఉన్నా.. ఎవరికి వారికి వారి వారి లక్ష్యాలు వేరు. ఈ నేపథ్యంలో కలిసే ఇరు రాష్ట్రాల మంత్రులు మధ్య సయోధ్యకు అస్కారమే లేదు. ప్రతి విషయంలోనూ ఎవరికి వారు మొండిగా వ్యవహరించటం.. చట్టంలోని లసుగులతో పీటముడులు వేసేసుకొని కూర్చోవటంతో సమస్యలకు పరిష్కారం దొరకని పరిస్థితి.
ఇలాంటి సమయంలో మధ్యవర్తిగా ఉండే గవర్నర్ వద్దకు వెళ్లినా పరిష్కారం దొరకని దుస్థితి. ఇరువురి మధ్య రాజీ చేయగలరు కానీ.. తప్పు ఫలానా వారిది అంటూ తేల్చే స్వేచ్ఛ ఆయనకు లేదన్నది ఒప్పుకోవాల్సిన అంశం. ఇలాంటి పరిస్థితుల్లో.. కేంద్రం దగ్గరకు వెళ్లే ఆలోచన ఒకటి చేస్తున్నారు.
మీరు మీరు కొట్టుకుంటూ మా దగ్గరకు వచ్చి తీర్పు చెప్పమంటే.. ఎలా అంటూ కేంద్రమంత్రులు సైతం చేతులు దులుపుకుంటున్నారు. రెండురాష్ట్రాల మధ్య గొడవల్లో తాము కల్పించుకోవటం ద్వారా లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకన్నది వారి ఆలోచన. ఇలా ఉన్న సమయంలో సమస్యలకు పరిష్కారం ఎలా లభిస్తుందన్నది అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు.
ఇలాంటి సమయంలో.. ఏదైనా అంశంపై రెండు రాష్ట్రాలకు.. ఒక వ్యాపార సంస్థకు మధ్య ఇష్యూ వస్తే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా.. ఆంధ్రాబ్యాంక్‌కు.. తెలంగాణ ఉన్న విద్యామండలి మధ్య తలెత్తిన ఇష్యూలో ఏపీ సర్కారుకు తలదూర్చకుండానే ఆంధ్రాబ్యాంకు న్యాయం ఎలా ఉంటుందో.. నిబంధనలు ఎలా ఉంటాయన్న విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన అకౌంట్ ఆంధ్రాబ్యాంకులో ఉంది. అందులోని లావాదేవాలను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ఉన్నత విద్యామండలి బ్యాంకుకు సూచనలు చేసింది.
దీనిపై స్పందించిన ఆంధ్రాబ్యాంకు న్యాయనిపుణుల సలహాలు.. సూచనలు తీసుకొని.. తెలంగాణ ఉన్నత విద్యామండలి కోరినట్లు చేయటం సాధ్యం కాదని తేల్చేసింది. నిబంధనలకు అనుగుణంగా చూసినప్పుడు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కోరినట్లుగా ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు అకౌంట్‌ను నిలివివేయటం సాధ్యం కాదని తేల్చేసింది.
ఈ ఉదంతంలో క్లారిటీ ఇచ్చే అంశం ఏమిటంటే.. ప్రతి సమస్యకు.. వివాదానికి పరిష్కారం ఉంటుంది. కానీ.. న్యాయం చెప్పేవారు.. సూచనలు చేసే వారు గోడ మీద పిల్లి వాటంగా ఉంటే మాత్రం.. వివాదాలు కొలిక్కి రావు కదా.. సింఫుల్‌గా ఇద్దరూ కూర్చోని మాట్లాడుకోవాలని చెబుతూ ఉంటారు.