Begin typing your search above and press return to search.

సైబర్ క్రైంలో తెలంగాణను దాటేసిన ఏపీ

By:  Tupaki Desk   |   1 Sep 2016 9:00 AM GMT
సైబర్ క్రైంలో తెలంగాణను దాటేసిన ఏపీ
X
టెక్నాలజీలో ఏపీని టాప్ లో నిలపాలన్నది చంద్రబాబు కల.. సమైక్యాంధ్రలోనూ హైదరాబాద్ ను సాఫ్టువేర్ హబ్ గా మార్చింది తానేనంటూ చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు నవ్యాంధ్రను చంద్రబాబు టెక్నాలజీలో ప్రథమ స్థానంలో నిలపగలరో లేదో కానీ సైబర్ నేరాల విషయంలో మాత్రం ఏపీ టాప్ టెన్ లో ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ సైబర్ నేరాల్లో ఆరో స్థానంలో ఉంది. సైబర్ నేరాలు ఆంధ్రాలో పెరిగితే - తెలంగాణలో తగ్గాయి. జాతీయ నేర నమోదు సంస్థ తెలుగు రాష్ట్రాల్లో వివిధ నేరాల సంఖ్యను వెల్లడించడంతో ఏపీ సైబర్ క్రైం స్టేట్ గా మారుతున్నట్లు అర్థమవుతోంది.

కాగా 2014తో పోల్చితే 2015లో తెలంగాణలో సైబర్ నేరాలు తగ్గాయి. 2014లో 703 కేసులు - 2015లో 687 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సైబర్ నేరాలు పెరిగాయి. 2014లో 282 నేరాలు - 2015లో 536 కేసులు నమోదయ్యాయి. ఆర్ధిక నేరాలను విశ్లేషిస్తే ఆంధ్రాలో నమ్మక ద్రోహం కేసులు 815 - మోసం కేసులు 5532 - ఫోర్జరీ కేసులు 235 - నకిలీ కరెన్సీ నోట్ల కేసులు 87 కలిపి మొత్తం 6669 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నమ్మకద్రోహం కేసులు 632 - మోసం కేసులు 8000 కేసులు - ఫోర్జరీ కేసులు 300 - నకిలీ కరెన్సీ నోట్ల కేసులు 47 కలిపి మొత్తం 8979 కేసులు నమోదయ్యాయి.

ఇక మిగతా నేరాల విషయానికొస్తే... ఆర్ధిక నేరాల్లో తెలంగాణలో 8979 కేసులు - ఆంధ్రాలో 6669 కేసులు నమోదయ్యాయి. 2015లో ఆంధ్రప్రదేశ్‌ లో మహిళలపై అత్యాచారాల కేసులు 1027 - తెలంగాణలో 1105 నమోదయ్యాయి. ఏపిలో అత్యాచార యత్నం కేసులు 206 - మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 4616 - అవమానించిన కేసులు 2200 కలిపి లైంగికపరమైన నేరాల కేసులు 8049 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో అత్యాచార ప్రయత్నాల కేసులు 43 - మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 3608 కేసులు - అవమానించిన కేసులు 1288 కలిపి మొత్తం 6044 కేసులు నమోదయ్యాయి. ఏపిలో హత్యలు 1099 - హత్యా యత్నాల కేసులు 1737 - కిడ్నాపింగ్ కేసులు 917 - దోపిడీ కేసులు 384 - కొట్లాటలు 554 - హింసాత్మక సంఘటనలు 436 - వరకట్నం మరణాలు 174 - దోపిడీలు 55 కలిపి మొత్తం హింసాత్మక కేసులు 6955 కేసులు నమోదయ్యాయి. హింసాత్మక కేసులకు సంబంధించి తెలంగాణలో హత్యలు 1188 - హత్యాయత్నం కేసులు 1143 - కిడ్నాపింగ్ కేసులు 1044 - దోపిడీలు 36 - దొంగతనాలు 377 - కొట్లాటలు 554 - హింసాత్మక సంఘటనలు 436 - వరకట్నం చావులు 262 కలిపి మొత్తం 6306 కేసులు నమోదయ్యాయి.