Begin typing your search above and press return to search.
కమలం కొత్త ఆశలు మొగ్గలు తొడుగుతున్నాయ్!
By: Tupaki Desk | 18 Dec 2017 9:18 AM GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ.. ‘డిపెండెంట్ పార్టీ’నే తప్ప.. ఇప్పటిదాకా ఇండిపెండెంట్ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని ఎవరో ఒకరి ఆసరాతో వారు మనుగడ సాగించాల్సిందే తప్ప.. తమంత తాముగా పార్టీగా ఎస్టాబ్లిష్ కాగల స్థితిలో ఇప్పటిదాకా లేరు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాజపా భాగస్వామ్య పార్టీనే అయినప్పటికీ.. ఏదో చంద్రబాబు దయ మీద మనుగడ సాగిస్తున్నట్లుగా ఉన్న భాజపా శ్రేణుల్లో ఇప్పుడు కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రభుత్వంలో తమ మాటకు చెల్లుబాటు పెరిగేలా.. ఈ ఉభయ రాష్ట్రాల విజయాలు దోహదం చేస్తాయని వారు సంబరపడుతున్నారు.
ఏపీలో భాజపా ఎన్నడూ బలమైన పార్టీగా ఆవిష్కృతం కాలేదు. ఇతరులతో పొత్తు పెట్టుకుంటే తప్ప.. అసలు సోదిలో లేకుండా పోయే పార్టీగా మాత్రమే వారికి ఉనికి ఉంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగిన భాజపా.. అధికారంలో కూడా భాగస్వామి అయింది. అయితే.. 2019 ఎన్నికల నాటికి ఇటు తెలుగుదేశంతో గానీ - అటు వైఎస్సార్ కాంగ్రెస్ తో గానీ.. భాజపా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని.. ఇద్దరితోనూ పార్టీ అగ్రనాయకత్వం సమాన స్నేహం కొనసాగిస్తున్నదని.. తెదేపా ప్రత్యేకించి.. వారి కూటమిలో భాగస్వామ్య పార్టీ అనే ఒక్క హోదా తప్ప.. కేంద్రంలోని పెద్దల వద్ద మాట చెల్లుబాటు విషయంలో జగన్ , చంద్రబాబు ఇద్దరినీ సమానంగానే చూస్తున్నారని అనేక పుకార్లు కూడా వ్యాప్తిలో ఉన్నాయి.
ఇలాంటి నేపథ్యంలో.. గత కొన్నాళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో సంభవిస్తున్న పరిణామాలు.. తెదేపా-భాజపా మైత్రిపై సందేహాలు రేకెత్తించే వాతావరణం ఏర్పడింది. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య దూరం పెరుగుతున్నదనే పుకార్లు వస్తున్నాయి. కేంద్రం చంద్రబాబుకు ప్రాధాన్యం తగ్గిస్తున్నట్టే.. రాష్ట్రంలోనూ బాబు సర్కార్.. భాజపా వారిని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి కూడా వారిలో చాలాకాలంగా ఏర్పడుతోంది. కాగా, తాజా ఫలితాలు పరిస్థితిలో మార్పుతెస్తాయని కమలనాధులు ఆశిస్తున్నారు. అనేక నామినేటెడ్ పోస్టులను కూడా చాలా కాలంగా నానబెడుతూ.. భర్తీ అంటూ చేస్తే భాజపా వారికి కూడా వాటా ఇవ్వాల్సి వస్తుందన్నట్లుగా మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబునాయుడు.. భాజపా హవా సుస్థిరం అని తేలుస్తున్న ఫలితాలతో.. రాష్ట్రంలోనూ తమకు ప్రాధాన్యం పెంచుతాడని కమల శ్రేణులు సంబరపడుతున్నారు. రాష్ట్రంలో సమీకరణాలు తమకు అనుకూలంగా పరిణమిస్తాయనే వారు ఆశిస్తున్నారు.