Begin typing your search above and press return to search.
కొత్త స్కెచ్ వేస్తున్న అధికారపార్టీ
By: Tupaki Desk | 15 Sep 2016 9:08 AM GMTప్రత్యేకహోదా చల్చార్చేందుకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో బీజేపీ నష్ట నివారణ చర్యలకు సిద్ధమవుతోంది. కేంద్రం ఇటీవలే ప్రకటించిన ప్రత్యేక సాయంపై మరింత స్పష్టత ఇప్పించటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ - బీజేపీ జాతీయ అధినేత అమిత్ షాను రాష్ట్రానికి రప్పించాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మూడు బహిరంగ సభలు పెట్టాలని యోచిస్తోంది. కేంద్రం ప్రకటించిన ప్రత్యేకసాయంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లోనూ - ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతిని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'ప్రత్యేకహోదా-ప్రత్యేక ప్యాకేజి' అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా గడచిన కొద్ది రోజులుగా మొదలైన వివాదం - దాని పర్యవసానాలను భాజపాలోని కొందరు నేతలు జాతీయ నాయకత్వంతో పాటు ప్రధానమంత్రికి నేరుగా నివేదికలు అందచేసినట్లు సమాచారం. ప్రత్యేకహోదా అన్నది ప్రజల మనోభావాల్లో సెంటిమెంట్ గా నిలిచిపోయిన నేపధ్యంలో ప్రత్యేక సాయంతో ప్రజల మనస్సులను శాంతిపచేయటం అంత సులభం కాదని రాష్ట్రంలోని కొందరు నేతలు జాతీయ నాయకత్వానికి స్పష్టం చేశారు.
ఇటీవలే కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ - వెంకయ్యనాయుడు లు ప్రకటించిన ప్రత్యేక సాయంపై ఇప్పటికీ ప్రజల్లో స్పష్టత రాలేదు. ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేకసాయం చేస్తామని చేసిన ప్రకటనలో మాత్రమే స్పష్టత ఉంది. ప్రత్యేకహోదా స్ధానంలో అందించనున్న ప్రత్యేకసాయంలో రాష్ట్రానికి ఏమేమి ప్రయోజనాలుంటాయి - ఒనగూరే ఇతర అంశాలు ఏమిటనే విషయాన్ని కేంద్రమంత్రులు చెప్పలేదు. పైగా ప్రయోజనాలు, సాయం విషయాన్ని వెబ్ సైట్ లో పొందుపరుస్తాం చూసుకోమని జైట్లీ చేసిన ప్రకటనపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. కేంద్ర చేయబోయే ప్రకటనపై మొన్న యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న నేపధ్యంలో అందిచబోయే సాయాన్ని వెబ్ సైట్ లో చూసుకోమని చెప్పటం కేవలం జైట్లీ బాధ్యతా రాహిత్యమేనంటూ ప్రజలు మండిపడ్డారు. జైట్లీ చేసిన ప్రకటన విషయంలో కూడా పూర్తిగా స్పష్టత లేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎక్కడ మాట్లాడినా రాష్ట్రానికి కేంద్రం రూ. 2.25 లక్షల కోట్ల మేరకు సాయం అందించనున్నట్లు చెబుతున్నారు. అందులో ఇప్పటి వరకూ అందించిన సాయంతో పాటు చేయదలచుకున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనల మొత్తం విలువను కూడా లెక్కించి వెంకయ్యనాయుడు చెబుతున్నట్లు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ లెక్కేమో ఇంకా తక్కువుంది. ఇతరత్రా సాయం విషయంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లే, మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను రివాజుగా మంజూరు చేసినవి మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర ప్రకటనలో డొల్లతనమే తప్ప వాస్తవాలు లేవని ఉన్నతాధికారులు అంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సైతం ఒకింత అస్పష్టమైన ప్రకటనలే చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజల్లో అయోమయం నెలకొంది. ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్న రాష్ట్ర భాజపా నేతలు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులను కలిసిన సమయంలో సెంటిమెంట్ గా మారిన ప్రత్యేకహోదా అంశం - కేంద్రం ప్రకటించిన ప్రత్యేకసాయం తదితరాలపై తమ వైపునుండి క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను వివరించినట్లు సమాచారం. ప్రజల్లో నెలకొన్న అయోమయం పోవాలంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి వివరిస్తేనే బాగుంటుందని పలువురు నేతలు చేసిన సూచనతో జాతీయ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా రాష్ట్రానికి రావటం పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ ఏడాదిలోనే మూడు బహిరంగ సభలు నిర్వహించి రాష్ట్రానికి కేంద్రం చేసిన - చేయబోయే సాయం పట్ల 'భరోసా'ను కల్పించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. మూడు సభల్లో ఒకటి తిరుపతిలో నిర్వహించమంటూ స్వయంగా ప్రధానే సూచించినట్లు తెలిసింది. మిగితా రెండు సభలకు విశాఖపట్నం - విజయవాడ - కడప - కర్నూలు - అనంతపురంలు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. తిరుపతి సభకు మాత్రం నరేంద్రమోడి హాజరవుతారని, మిగితా రెండు సభల్లో అమిత్ షాతో పాటు ఇతర కేంద్రమంత్రులు హాజరవుతారని భాజపా వర్గాలు చెప్తున్నాయి.