Begin typing your search above and press return to search.
బీజేపీతో చంద్రబాబుకు ఇక బీపీ
By: Tupaki Desk | 13 March 2017 6:23 AM GMTఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీ బీజేపీ నేతల్లో విశ్వాసాన్ని పెంచా యి. దీంతో మళ్లీ వారు తమ స్వరం పెంచడానికి.. చంద్రబాబుతో గిల్లికజ్జాలకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పెద్దగా గొడవలు పెట్టుకోవడం లేదు... అలాగే ఏపీలో ముఖ్య బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, హరిబాబు, కామినేని శ్రీనివాస్ వంటివారు చంద్రబాబుకు గట్టి మద్దతు దారులు కూడా. ఎటొచ్చీ సోము వీర్రాజు... కాంగ్రెస్ నుంచి కొత్తగా వచ్చిన పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటివారు మాత్రం ఛాన్సు దొరికితే చాలు చంద్రబాబును ఏసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి నేతలందరికీ మరోసారి మంచి ఛాన్సు దొరికినట్లయింది. యూపీలో బీజేపీ దుమ్ము రేపడం... పంజాబ్ మినహా అన్ని చోట్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుండడంతో ఏపీ బీజేపీ నేతల్లో కాన్ఫిడెన్సు బాగా పెరిగిందట. దీంతో చంద్రబాబుపై దండయాత్రకు వారు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి ఇంతకుముందు కూడా ఏపీలో బీజేపీలోని కొందరు నేతలు తరచూ చంద్రబాబును విమర్శిస్తూ... బీజేపీ అధిష్ఠానానికి చంద్రబాబుపై కంప్లయింట్లు చేస్తూ చీకాకు పెట్టేవారు. కానీ.. బీహార్లో బీజేపీ బొక్కబోర్లా పడిన తరువాత వారి దూకుడు తగ్గింది. ఆ తరువాత మొన్న నోట్ల రద్దు తరువాత కూడా ఏపీ బీజేపీ నేతలు పూర్తిగా సైలెంటయిపోయారు. పైగా నోట్ల రద్దుపై వేసిన సీఎంల కమిటీకి సారథ్య బాధ్యత చంద్రబాబుకే అప్పగించడంతో ఏపీ బీజేపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయపడింది. ఆయన్ను విమర్శిస్తే నోట్ల రద్దును భూతద్దంలో చూపించి దెబ్బతీస్తారని భయపడ్డారు. దీంతో కొన్ని నెలలుగా ఏపీలో వారి వాయిసే వినిపించడం లేదు. దీంతో చంద్రబాబు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు యూపీలో బీజేపీ చితక్కొట్టేయడంతో చాలాకాలంగా నోటిని అదుపులో పెట్టుకుని ఉన్న బీజేపీ నేతలంతా మళ్లీ రంకెలేస్తున్నట్లు టాక్.
ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబు బద్ధ విరోధి, బీజేపీ నేత పురందేశ్వరి తన నోరు విప్పారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరిగితే ఆ పార్టీతో పొత్తు తెంచుకోవడానికి తమ అధిష్ఠానం వెనుకాడబోదని ఆమె అన్నారు. బీజేపీ మళ్లీ రైజింగ్ లోకి రావడంతోనే ఆమె అలా మాట్లాడారని స్పష్టమవుతోంది. మిగతా బీజేపీ నేతలు కూడా ఆమె దార్లోనే పయనించడం ఖాయం. అదే జరిగితే చంద్రబాబుకు బీజేపీతో బీపీ రావడం గ్యారంటీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/