Begin typing your search above and press return to search.
కౌంట్ డౌన్ స్టార్ట్: బీజేపీ మంత్రుల రాజీనామా
By: Tupaki Desk | 8 March 2018 4:17 AM GMTఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ కటీఫ్ చెప్పింది. కేంద్ర క్యాబినెట్ లో టీడీపీ తరఫున మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు - సుజనాచౌదరి గురువారం రాజీనామా చేయనున్నట్టు ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తాం తప్ప ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేతులెత్తేసిన నేపథ్యంలో తన క్యాబినెట్ సహచరులతో చంద్రబాబు సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. అనంతరం బాగా పొద్దుపోయిన తర్వాత అమరావతిలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఇదిలాఉండగా... చంద్రబాబు నిర్ణయంతో బీజేపీ సైతం కీలక నిర్ణయం తీసుకునేందుకు డిసైడ్ అయింది. ఏపీ క్యాబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు నేడు రాజీనామా చేయనున్నట్టు తెలిసింది. రాజీనామాలకు సిద్ధం కావాలని పార్టీ హైకమాండ్ నుంచి బీజేపీ మంత్రులకు ఆదేశాలు వచ్చినట్టు పార్టీవర్గాల సమాచారం. అంతకుముందు బుధవారం ఏపీ అసెంబ్లీ లాబీలో ఇదే విషయమై బీజేఎల్పీలో చర్చ జరిగింది. రాష్ర్ట అభివృద్ధి విషయంలో టీడీపీ తమను నిందిస్తే చూస్తూ ఊరుకోబోమని - ఆ పార్టీకి దీటైన జవాబు ఇస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు తేల్చిచెప్పారు. భేటీలో బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు - మాణిక్యాలరావు - ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు ఆకుల సత్యనారాయణ - ఎమ్మెల్సీలు సోమువీర్రాజు - మాధవ్ పాల్గొన్నారు. ఏపీ బీజేపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో టీడీపీతో పొత్తు - భవిష్యత్ కార్యాచరణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా...ఏపీకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంలో చేరామని, ఏ లక్ష్యంకోసం చేరామో ఆ లక్ష్యం నెరవేరలేదని తన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, పునర్నిర్మాణంలో సాయం దొరుకుతుందని ఆశించామని తెలిపారు. సమస్య పరిష్కారంకోసం నాలుగేండ్లు ఎదురుచూశామని, కానీ, తమ సహనానికి ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిణామాల కారణంగానే తీవ్ర నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. రాజీనామాల తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూస్తామన్నారు.