Begin typing your search above and press return to search.
ఏపీ బడ్జెట్: అధ్యక్షా.. నోట్ దిస్ పాయింట్స్
By: Tupaki Desk | 15 March 2017 8:48 AM GMTఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మరోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. సుదీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. ఏపీ రాష్ట్ర సర్కారు కలల్ని ఆయన ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. గడిచిన కాలంలో తామేం సాధించామో చెప్పుకున్న ఆయన.. రానున్న రోజుల్లో ఏమేం చేయనున్నది చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించటమే తన లక్ష్యమన్న యనమల.. రాజధానిని ప్రాచీన సంస్కృతిని వేళ్లూనికొని.. ప్రపంచ స్థాయి ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందన్న మాట చెప్పుకొచ్చారు.
దేశానికి ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పిన రాజధాని నిర్మాణం గురించి గొప్పలు చెప్పిన ఆయన.. తన బడ్జెట్ లో రాజధాని నిర్మాణం కోసం వెచ్చించిన నిధుల్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. బడ్జెట్ కేటాయింపుల్ని చూస్తే.. ఈ ఆర్థికసంవత్సరంలో రాజధాని నిర్మాణం మీద పెద్దగా దృష్టి సారించటం లేదన్న విషయం అర్థమవుతుంది. ఇప్పటికే తాత్కాలిక భవనాల పేరుతో భారీగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బాబు సర్కారు రానున్న రోజుల్లో మరెన్ని దుబారా ఖర్చుల్ని చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా యనమల చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని చూస్తే..
ఆశలు.. ఆకాంక్షలు
= ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలన్నదే మన ప్రయత్నం
= ఒకవైపు ప్రాచీన సంస్కృతిలో వేళ్లూనికొని.. మరోవైపు ప్రపంచస్థాయి ఆకాంక్షలకు రాజధాని అద్దం పట్టాలి.
= మన రాజధాని నగరం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలబడనుంది
= 9 రంగాల ఆధారంగా రాజధాని నిర్మాణం
= పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టేదిశగా కదులుతున్నాం
= విజన్ 2029 నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుంది
= 2017జూలై ఒకటి నుంచి జీఎస్టీ ప్రవేశపెట్టబోతున్నాం
= జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది. పన్నుల ఎగవేత తగ్గుతుంది
= ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికీ గమ్యంగా 'సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్'ను చూస్తున్నారు
ఏమేం సాధించామంటే..
= గత 2.5ఏళ్లలో వివిధ ప్రమాణాల ప్రకారం మనం గొప్ప పురోగతి సాధించాం
= రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం
= జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాల్ని రాష్ట్రం గెలుచుకుంది
= శక్తి, ఇంధన రంగాల్లో రాష్ట్రానికి ఐదు పురస్కారాలు దక్కాయి
= 192 రోజుల్లోనే నూతన శాసనసభ భవనాన్ని నిర్మించుకోగలిగాం
= ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశాం
= ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ సాధించాం
ఇప్పుడిలా ఉన్నాం..
= కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నాం
= దేశంలో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది
= రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6.78శాతం వాటాతో మత్స్యరంగం గణనీయస్థానంలో ఉంది
= డిజిటల్ చెల్లింపుల పద్ధతుల్ని అమలుపరచడంలో మనం దేశానికే మార్గదర్శకంగా ఉన్నాం
ఏం చేయనున్నామంటే..
= ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతానికి 8 మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు
= కృష్ణపట్నంలో కోస్టల్ ఎకనమిక్ ఎంపాయిమెంట్ జోన్ ఏర్పాటుకు చర్యలు
= జెరూసలెం యాత్ర సబ్సిడీ రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు
సాయం చేసిన వారి ప్రస్తావన
= రాష్ట్ర రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/