Begin typing your search above and press return to search.
ఏపీలోనే బడ్జెట్ సమావేశాలు..?
By: Tupaki Desk | 15 Dec 2015 5:18 AM GMTఏపీకి సంబంధించిన పాలనా అంశాలు ఒక్కొక్కటిగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిపోతున్న సంగతి తెలిసిందే. జూన్ మొదటి వారానికి హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగులంతా విజయవాడకు తరలి రావాల్సిందేనని ఏపీ సర్కారు విస్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీ సర్కారు కాస్త ఊగిసలాటకు గురైనప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విజయవాడకు ఉద్యోగుల్ని తీసుకొచ్చే విషయంలో కరకుగా వ్యవహరించాలన్న ఆలోచనకు వచ్చారు. ఇదిలా ఉంటే.. పాలనా పరంగా మరికొన్ని అంశాల విషయంలోనూ చంద్రబాబు దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటివరకూ ఓ మోస్తరు నుంచి భారీ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలంటే స్టార్ హోటళ్లలో నిర్వహించటం ఒక రివాజుగా మారింది. బెజవాడలో అందుకు తగిన మౌలిక వసతి లేకపోవటం కూడా కారణం. అయితే.. ఈ ఇబ్బందిని అధిగమించాలన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశాన్నే తీసుకుంటే.. బెజవాడలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఇలా చేయటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.
దీన్ని తగ్గించే దిశగా ఏపీ సర్కారు అడుగులు వేస్తోంది. దీన్లో భాగంగానే.. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. హోటల్లో సమీక్షా సమావేశం జరగటం ఇదే చివరిసారి అని తేల్చిన ఆయన.. జూన్ నాటికి ఏపీ అధికార యంత్రాంగం మొత్తం విజయవాడకు వచ్చేస్తుందని తేల్చేశారు. అంతేకాదు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత విజయవాడలోనే సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. బాబు మాటలు చూస్తుంటే.. ఈ నెల 17 (గురువారం) నుంచి హైదరాబాద్ లో జరిగే శీతాకాల సమావేశాలే ఉమ్మడి రాజధానిలో జరుగుతాయన్న భావన వ్యక్తమవుతోంది. అంటే.. రానున్న బడ్జెట్ సమావేశాల సమయానికి ఏపీలోనే ఏర్పాట్లు జరుగుతాయా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. కేవలం రెండు.. మూడు నెలల వ్యవధిలో సాధ్యం కాకపోవచ్చని.. వచ్చే శీతాకాల సమావేశాలు.. లేదంటే వర్షాకాల సమావేశాల నుంచి ఏపీలో ఏర్పాటు చేసుకోవచ్చన్న అభిప్రాయాన్ని ఒక సీనియర్ అధికారి వ్యక్తం చేశారు.