Begin typing your search above and press return to search.
మండలి రద్దు బిల్లు పెట్టిన జగన్.. ఇందుకోసమేనన్న నాని
By: Tupaki Desk | 27 Jan 2020 7:38 AM GMTశాసనమండలి రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు. దీనిపై చర్చను మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. అంతకుముందే శాసన మండలి రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అనంతరం బీఏసీ సమావేశం లో రద్దు తీర్మానం పై ఈరోజు అంతా చర్చించాలని తీర్మానించారు.
అనట్టుగానే సభా నాయకుడు అయిన వైఎస్ జగనే ఈ శాసనమండలి రద్దు తీర్మానం బిల్లును ఏపీ అసెంబ్లీ లో ప్రవేశపెట్టడం విశేషం. అనంతరం చర్చను స్పీకర్ ప్రారంభింపచేశారు.
అనంతరం ఈ బిల్లుపై తొలి చర్చను మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు.అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం చెప్పలేదని.. అమరావతితోపాటే విశాఖ, కర్నూలులు రాజధానులుగా ఉంటాయని వివరించారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరింపచేయాలనే సీఎం జగన్ మూడు రాజధానులకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ ప్రయోజనాల కోసమే టీడీపీ అరాచకాలు సృష్టిస్తోందని మండి పడ్డారు.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఈ రాష్ట్రం విడిపోయి ఈ దుస్థితికి దిగజారిందని.. భవిష్యత్తు లో మరోసారి ఏపీ విడిపో వద్దనే సీఎం జగన్ 3 రాజధానులను తీసుకొస్తున్నారని మంత్రి ఆళ్ల నాని వివరించారు.
విభజన తో ఇప్పటికే హైదరాబాద్ వంటి మహా నగరాన్ని కోల్పోయామని.. మరోసారి ఏపీకి ఆ దుస్థితి రాకూడదనే 3 రాజధానులు అని మంత్రి నాని వివరించారు. జగన్ కు కులతత్వాన్ని అంటగట్టి కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.