Begin typing your search above and press return to search.
అమరావతికి అంకురార్పణ
By: Tupaki Desk | 22 Oct 2015 7:19 AM GMT22.10.15, గురువారం, మధ్యాహ్నం 12.38 నిమిషాలు..
ఆంధ్రులకు కొత్త చరిత్ర మొదలైంది.. ఆశల నగరం అమరావతికి దేశ ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రజా రాజధానికి ప్రజల సమక్షంలో పునాదిరాయేశారు.
వేల సంవత్సరాల ఉజ్వల చరిత్ర ఉన్న అమరావతిలో మరిన్ని వేల సంవత్సరాల చరిత్ర లిఖంచడానికి శిలాన్యాసం చేశారు. కోట్లాది ఆంధ్రుల ఆశల సౌధానికి అంకురార్పన చేశారు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా, కోట్ల మంది తెలుగువారి స్వప్నంగా, ఆధునిక మహానగరంగా అవతరించబోతున్న అమరావతికి ప్రధాని తన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
లక్షలాది ప్రజల సాక్షిగా, దేశ విదేశీ ప్రముఖుల సమక్షంలో తెలుగు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, మహోజ్వల భవిష్యత్తుకు పునాదిరాయి వేశారు ప్రధాని. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గం అక్కడే ఉండగా, లక్షలాది ప్రజలు తిలకిస్తుండగా.. అమరావతికి రాలేకున్నా టీవీల ముందు కూర్చుని చూస్తున్న కోట్లాది ఆంధ్రుల ఆశీస్సులతో అమరావతి విత్తు నాటుకుంది. ఇక మొలక రావడం.. మొగ్గ తొడగడం.. మహా వృక్షమై ఎదిగి మానవాళికి నీడనివ్వడమే తరువాయి.