Begin typing your search above and press return to search.
కొత్త రాజధానిలో సరికొత్త భూవివాదం
By: Tupaki Desk | 8 Jan 2020 5:30 PM GMTఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా మారుతాదంటున్న విశాఖపట్నంలో అప్పుడే భూవివాదాలు మొదలయ్యాయి. పాలక పక్ష ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ విపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజుపై ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఓ 8 ఎకరాల చెరువును కబ్జా చేశారని అక్కడి మాజీ ఎమ్మెల్యే - టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. చెరువు గర్భాన్ని తవ్వేస్తూ జేసీబీతో చదును చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ బండారు సీరియస్ అయ్యారు. అయితే తాను చదును చేయిస్తున్నది ప్రభుత్వ భూమి అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ఎమ్మెల్యే అదీప్ రాజు సవాల్ విసురుతున్నారు.
వివాదానికి కేంద్ర బిందువైన ఈ చెరువు రాంపురం మండలంలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉంది. దీన్ని వీర్రాజు చెరువు అంటున్నారు. ఈ వీర్రాజు చెరువులోని దాదాపు ఎనిమిది ఎకరాల 68 సెంట్ల స్థలాన్ని ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాంపురంలోని స్థలాన్ని చదును చేస్తుండగా, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు - ఘటనా స్థలానికి చేరుకుని అడ్డుకోవటంతో వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. గ్రామ సర్వే రికార్డుల్లో అది వీర్రాజు చెరువుగా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే చెరువును ఆక్రమిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోనూ దీనిపై ఫిర్యాదు చేశామని బండారు చెబుతున్నారు. కాగా తనపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే అదీప్ రాజు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇనాం భూముల కింద కావలి వీర్రాజు అనే వ్యక్తి 1907లో టీడీ నెంబర్ 2568 కింద ప్రభుత్వం నుంచి పట్టా పొందారని, తర్వాత దాన్ని నాయుడు బాబు అనే వ్యక్తి కొన్నారని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఆ నాయుడు బాబు నుంచి తాము 1988లో కొనుగోలు చేశామని అదీప్‌రాజు అంటున్నారు. ఆ తర్వాత వీర్రాజు వారసులమంటూ కొందరు రైత్వారీ పట్టాతో తమను సంప్రదించారని, ఆ వివాదాన్ని 2014లో లోక్ అదాలత్ లో పరిష్కరించుకున్నామని ఎమ్మెల్యే చెబుతున్నారు. 2016లోనూ - 2019లోనూ టీడీపీ కోర్టుకి వెళ్లిందని, అప్పటి తాహసీల్దార్లు తమకు క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అక్కడ ఎటువంటి వాటర్ బాడీస్ లేవని, అది వ్యవసాయ భూమి అనీ - తాహసీల్దార్లు పేర్కొన్నారని ఎమ్మెల్యే చెప్పారు. కాగా ఈ వివాదంపై కలెక్టర్ వినయ్‌చంద్ స్పందించారు. ఈ వివాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక అధికారుల నుంచి తెప్పించుకుని పరిశీలిస్తామన్నారు.
విశాఖను రాజధానిగా ప్రకటించడం వెనుక ఇలాంటి కబ్జా ఆలోచనలున్నాయని.. ఇక్కడి ప్రభుత్వ, ప్రయివేటు భూములను ఆక్రమించుకోవడానికి వైసీపీ నేతలు భారీ ప్రణాళిక రచించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.