Begin typing your search above and press return to search.
అమరావతిలో పవన్ ఫ్లెక్సీలు
By: Tupaki Desk | 5 May 2016 9:26 AM GMTఏపీ రాజధాని అమరావతి ఇష్యూలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏపీ రాజధానికి చెందిన కొన్ని గ్రామాలు (ఉండవల్లి.. పెనుమాక మరికొన్ని) ఏపీ సర్కారు చేస్తున్న భూసేకరణను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో ఇదే అంశం మీద కొన్ని గ్రామాల వారు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించటం.. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయా గ్రామాల్లో సందర్శించి.. అక్కడి వారి వాదన వినటం తెలిసిందే.ఈ సందర్భంగా భూములు ఇచ్చేందుకు ఇష్టపడే వారి వద్దనే సేకరించాలని.. ప్రభుత్వం బలవంతంగా భూముల్ని సేకరించకూడదని అల్టిమేటం ఇవ్వటం.. ఆ తర్వాత ఏపీ సర్కారు భూసేకరణను తాత్కాలికంగా వాయిదా వేయటం జరిగింది.
అయితే.. తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించాలంటూ ప్రభుత్వం తమకు నోటీసులు ఇస్తుందంటూ ఉండవల్లి.. పెనుమాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన అంశంపై పవన్ స్పందించాలంటూ వారు పవన్ ఫ్లెక్సీల్ని తమ పొల్లాల్లో వేలాడదీయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి.. ఈ విషయంపై పవన్ మరోసారి రియాక్ట్ అవుతారా..?