Begin typing your search above and press return to search.

రైతులు నరేంద్రమోడీకి మెయిల్‌ పెట్టారు..!

By:  Tupaki Desk   |   17 March 2015 4:37 AM GMT
రైతులు నరేంద్రమోడీకి మెయిల్‌ పెట్టారు..!
X
మోడీ ప్రధానమంత్రి అయ్యాకా ఆయన జనాలతో కమ్యునికేట్‌ కావడానికి చాలా ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగత ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా.. ప్రధానమంత్రి ఆఫీసు పేరుమీద ఉన్న ట్విటర్‌ ఖాతా ద్వారా మోడీ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు. తన ఫాలోయర్లతో సూటిగా మాట్లాడుతున్నాడు. అలా ట్వీట్‌ చేస్తున్న మోడీ రీట్వీట్‌ల ద్వారా ప్రజాస్పందనను కూడా అర్థం చేసుకొనే అవకాశం ఉంది.

అలాగే ప్రజలు ప్రభుత్వంతో అనుసంధానం కోసం సోషల్‌నెట్‌వర్కింగ్‌ను, ఇంటర్నెట్‌ సేవలను బాగా ఉపయోగించుకోవాలనేది మోడీ థియరీ. ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా ఈ అంశం గురించి కొంత అవగాహన పెరిగినట్టుగానే ఉంది.

తాజాగా ఏపీ రాజధాని ప్రతిపాదితప్రాంత రైతులు ప్రధానమంత్రి మోడీకి తమ దీనస్థితిని మెయిల్‌ చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. ఏపీ ప్రభుత్వం రాజధాని అంటూ భూముల విధ్వంసానికి పాల్పడుతోందని.. మూడు పంటలు పండే భూములను నాశనం చేస్తోందని వారు ప్రధానికి వివరించారు.

తమ భూముల ఫోటోలను తీసి వారు పీఎంవో ఆఫీసు మెయిల్‌ఐడీకి అటాచ్‌ చేసి పంపారు. మరి ఈ మెయిల్‌కు ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరమైన అంశమే.

ప్రజలు ప్రభుత్వంతో ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం కావాలనే ప్రధాని ఇప్పుడు వీరి మెయిల్‌కు పీఎంవో నుంచి ప్రతిస్పందన పంపిస్తారా? లేక.. ఇక్కడ అధికారంలో ఉన్నది తమ మిత్రపక్షమే కాబట్టి.. ఆ మెయిల్‌ను లైట్‌ తీసుకొంటారా?! రిప్లై మెయిల్‌ వస్తేగానీ అర్థం కాదు!