Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: విశాఖే ఏపీ రాజధాని..పని ప్రారంభం
By: Tupaki Desk | 19 Dec 2019 4:11 AM GMTఏపీకి మూడు రాజధానులు అవసరం అని అసెంబ్లీలో జగన్ ప్రకటించిన రెండోరోజే విశాఖలో పని ప్రారంభం కావడం అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్ అంతకుముందే ఇక్కడ అన్ని పనులు చక్కదిద్దినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికే ఏపీ సచివాలయం సహా ముఖ్యమంత్రి కార్యాలయం కోసం విశాఖ దాని పరిసరాలలో భవనాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. 2వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ సచివాలయం కోసం సిద్ధం చేసినట్లు తెలిసింది. అప్పటిదాకా విశాఖలో ఖాళీగా విజయవాడకు చెందిన ఓ బడా టైకూన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఏపీ సచివాలయం కొనసాగనుందట.. దాదాపు రెండున్నర లక్షల అడుగుల చదరపు అడుగుల ఈ భారీ భవనం తాత్కాలిక సచివాలయంగా పనికి వస్తుందని జగన్ సర్కారు తేల్చిందట.. ఖాళీగా ఉన్న ఈ సాఫ్ట్ వేర్ సంస్థను తాత్కాలిక సచివాలయంగా వాడుకునేందుకు జగన్ సర్కారు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఇక మిగతా ప్రభుత్వ కార్యాలయాల కోసం ఆంధ్రా యూనివర్సిటీలో ఖాళీగా చాలా భవనాలున్నాయి. విశాలమైన ఏయూలోని ఈ భవనాలను కూడా వాడుకోవాలని జగన్ సర్కారు యోచిస్తోంది.
ఇక భీమిలీ వైపున్న ఒక విశాలమైన భవనం ముఖ్యమంత్రికి నివాసంగా గుర్తించినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.
వీటన్నింటికి విశాఖ భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు దగ్గరలో ఉండడంతో రవాణా సదుపాయాలకు ఢోకా ఉండదని జగన్ సర్కారు ఈ ప్లాన్ చేసినట్టు తెలిసింది. జగన్ వైసీపీ సర్కారుకు ఇప్పుడు పరదేశీపురం కీలకమైన ప్రదేశంగా మారనుందట..
ఇక సచివాలయాన్ని పరిపాలన కేంద్రాన్ని విజయవాడ నుంచి వైజాక్ కు మూడు నెలల్లోనే అంటే వచ్చే ఏప్రిల్ లోగా తరలించాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలిసింది.
జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేయడానికి ముందే వైజాగ్ లో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కోసం వైసీపీ ప్రభుత్వం అన్ని సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ విషయం వైసీపీలోని కీలకమైన నలుగురైదుగురు అగ్రశ్రేణి నేతలకు మాత్రమే తెలుసట..
ఇప్పటికే జగన్ నియమించిన నిపుణుల కమిటీ కూడా వైజాగ్ ను ఏపీ పరిపాలన రాజధానిగా చేయాలని రిపోర్ట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే జగన్ ముందస్తుగా వైజాగ్ లో పరిపాలనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. నిపుణుల కమిటీ నివేదిక ఇప్పుడు లాంఛనమే కానుందట..
ఇక విశాఖలో గవర్నర్ నివాసం కోసం అనువైన ప్రదేశం ఒకటి శోధించాల్సి ఉంటుంది. అప్పటి వరకూ విజయవాడలోనే రాజ్ భవన్ ఉండనుంది.