Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ భేటికి రెడీ.. కీలక అంశాలివే?

By:  Tupaki Desk   |   24 Aug 2020 4:30 PM GMT
ఏపీ కేబినెట్ భేటికి రెడీ.. కీలక అంశాలివే?
X
ఏపీ ప్రజలపై మరోసారి వరాల వాన కురిసే అవకాశం ఉంది.కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఏపీ కేబినెట్ సమావేశమవుతోంది. సెప్టెంబర్ 3న ఏపీ మంత్రివర్గం భేటి కాబోతోంది. ఈ భేటిలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించబోతున్నారని తెలుస్తోంది. ఎజెండాకు సంబంధించిన పూర్తి వివరాలు ఖరారు చేస్తున్నారు.

ప్రతినెలలో 15 రోజులకు ఒకసారి.. 2 - 4 బుధవారాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఒకవేళ బుధవారం సెలవు వస్తే.. మరుసటి రోజు సమావేశం ఉంటుంది. పరిస్థితిని బట్టి అటూ ఇటూగా నిర్వహిస్తున్నారు.

అంతేకాదు.. ప్రతీ కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రతీ నెలా ఒకటి, మూడు శనివారాల్లో ముందస్తుగా శాఖల వారీగా ప్రతిపాదనలు పంపిస్తున్నారు.