Begin typing your search above and press return to search.
అమరావతిపై సీబీఐ.. 25న కేబినెట్ లో నిర్ణయం?
By: Tupaki Desk | 20 Sep 2020 2:00 PM GMTఅమరావతి భూ కుంభకోణం లెక్కతేల్చాలని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందా? హైకోర్టులో ఎదురుదెబ్బలు.. కేంద్రం జాప్యంతో ఈ విషయంలో ఎటూ తేలకుండా పోతున్న పరిణామాలపై సీరియస్ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోందా? అంటే ఔననే అంటున్నాయి సచివాలయ వర్గాలు.
సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 25న ఏపీ కేబినెట్ భేటి జరగబోతోంది. వెలగపూడి సచివాలయంలో ఈ కేబినెట్ భేటి నిర్వహించబోతున్నారు.
రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాలు.. సంక్షేమ పథకాల సమీక్ష - కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై మంత్రి వర్గం చర్చిస్తుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలుపై పరిశీలిస్తారని సమాచారం.
ఈ క్రమంలోనే అమరావతి భూముల కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తరువాత ఏం చేయాలనే దానిపై కేబినెట్ చర్చించనుంది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడంతో సీబీఐకి ఈ కేసు అప్పగించాలని కేబినెట్ తీర్మానించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయానికి వస్తుందని అంటున్నారు.
అమరావతి భూముల కుంభకోణంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని జగన్ నిర్ణయించారు. దీంతో సీబీఐకి అప్పగిస్తే అమరావతి కుంభకోణాలపై ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరాలు.. ఆంక్షలు ఉండవని జగన్ భావిస్తున్నారు. విశాఖకు రాజధాని తరలింపుపై కూడా జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.