Begin typing your search above and press return to search.

రఘువీరాకు టైమిస్తే..ఆయన మోడీ కారు కదా?

By:  Tupaki Desk   |   16 March 2016 12:38 PM IST
రఘువీరాకు టైమిస్తే..ఆయన మోడీ కారు కదా?
X
వ్యక్తిత్వ వికాసకుడిగా మాటలు చెప్పే ప్రధాని మోడీ మాటకు.. చేతకు మధ్య అంతరం అందరికి తెలిసిందే. మాటల్లో కనిపించేంత సాఫ్ట్ నెస్ చేతల్లో అస్సలు కనిపించదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నేతకే తన అపాయింట్ మెంట్ ఇవ్వటానికి నెలల తరబడి టైం తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఆయన.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డికి ఎందుకు టైమిస్తారు?

తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా నినాదాన్ని ఢిల్లీ స్థాయిలో బలంగా వినిపించే ప్రోగ్రాం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తగ్గట్లే.. ఏపీ కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాల్ని చేపట్టింది. ఇందులో భాగంగా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు కలెక్ట్ చేసిన కోటి సంతకాల్ని ప్రధాని మోడీని కలిసి.. ఆయనకు ఇవ్వాలని రఘువీరా అండ్ కో నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారు.

కొందరికి మామూలుగానే అపాయింట్ మెంట్ ఇవ్వని మోడీ.. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై తనను కలవటానికి వచ్చే ఏపీ కాంగ్రెస్ నేతలకు టైమిచ్చే అవకాశమే లేదు. అనుకున్నట్లే.. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన ఏపీ కాంగ్రెస్ నేతలు.. తాము సేకరించిన కోటి సంతకాల్ని మోడీ ఇంటి ముందు ఉంచి నిరసన తెలపాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ఇలాంటి చర్యలు వద్దంటూ కాంగ్రెస్ అధినాయకత్వం వారించటంతో.. తాము సేకరించిన కోటి సంతకాల్ని పార్టీ అధినేత్రి సోనియమ్మ చేతికి ఇచ్చి.. ఏపీకి న్యాయం చేసేలా ప్రధానితో మాట్లాడమని కోరనున్నారు. విభజన పేరుతో ఏపీని ఇష్టారాజ్యంగా పోట్లు పొడిచేసిన సోనియమ్మ.. రఘువీరా అండ్ కో మాటలకు ఎంతలా స్పందిస్తారో చూడాలి.