Begin typing your search above and press return to search.

బాబుపై రాహుల్‌ కు ఏపీ కాంగ్రెస్‌ నేతల పీపీటీ!

By:  Tupaki Desk   |   19 Dec 2018 3:18 PM GMT
బాబుపై రాహుల్‌ కు ఏపీ కాంగ్రెస్‌ నేతల పీపీటీ!
X
తెలంగాణలో ఎన్నికల ఫలితాల తరువాత ఏపీ కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు విషయంలో మరింత క్లారిటీ వచ్చినట్లుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా మారడం తప్ప లాభం లేదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. అందుకే టీడీపీతో పొత్తు ఉందంటూ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి చెప్పడానికి సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే విషయాన్ని చంద్రబాబు ఢిల్లీ స్ధాయిలో పావులు కదిపారు. కాంగ్రెస్ కు సంబంధం లేని జాతీయ పార్టీ సీనియర్ నేత ఒకరు రాహుల్ - చంద్రబాబుకు మధ్యవర్తిత్వం వహించటంతో తెలంగాణ ఎణ్నికలకు ముందు ఈ పొత్తు కుదిరింది. అయితే... చంద్రబాబుతో కలవకపోయుంటే కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చుండేదన్నది కాంగ్రెస్ నేతల వాదన. అందుకే... తెలంగాణాలో అనుభవాన్ని చూసిన తర్వాత ఏపిలో కాంగ్రెస్ నేతలు మేలుకున్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు వద్దని మెజారిటీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై రాహుల్ తో చర్చించేందుకు ఈనెల 25వ తేదీన దిల్లీకి వెళుతున్నారు ఏపి నేతలు.

నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అవినీతి... ప్రజల్లో ఆయనపై ఉన్న వ్యతిరేకత అంతా రాహుల్‌ కు అర్థమయ్యేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేస్తున్నారట. ఈ దశలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే నష్టపోవడం తప్ప కాంగ్రెస్‌కు ఇంకే ఫలితమూ ఉండదని.. చంద్రబాబుపై ఈ నాలుగున్నరేళ్లు చేసిన పోరాటంతో సాధించుకున్న అంతోఇంతో మైలేజి కూడా మళ్లీ ఆయనతో కలిస్తే పోతుందని రాహుల్ గాంధీ ముందు కుండబద్దలు కొట్టబోతున్నారని టాక్. మరి.. వీరి మాట రాహుల్ వింటారో లేదో చూడాలి.