Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ నేతలు నోరెత్తితే ఒట్టు!

By:  Tupaki Desk   |   19 April 2019 2:30 PM GMT
ఏపీ కాంగ్రెస్ నేతలు నోరెత్తితే ఒట్టు!
X
ఎన్నికల ముందు అంటే ఎలాగో చంద్రబాబునే సమర్థించారు కాంగ్రెస్ వాళ్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆ విషయాన్ని ఓపెన్ గానే చెప్పారు. తమ ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డే అని కాంగ్రెస్ వాళ్లు తేల్చారు. చంద్రబాబుతో తమకు వైరం లేదని అలా చెప్పారు. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు దోస్తీ - ఆ పై తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ ల పొత్తు.. ఇవన్నీ ఆ రెండు పార్టీల మధ్యన దూరాన్ని తగ్గించాయి.

ఇక పోటీ విషయంలో కూడా కాంగ్రెస్-టీడీపీలు పరస్పరం సహకరించుకున్నాయని - కాంగ్రెస్ కు ఒక సీట్లో తెలుగుదేశం విజయం కోసం సహకరించిందని కూడా ప్రచారం జరిగింది. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీర పోటీ చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించినట్టుగా ప్రచారం జరిగింది. ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ కు స్థానం దక్కడానికి బాబు అలా సహకరించారని చాలా మంది చెప్పుకున్నారు.

అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ.. పోలింగ్ పూర్తి అయిన తర్వాత మాత్రం కాంగ్రెస్ వాళ్లు మారు మాట్లాడటం లేదు. ఏం మాట్లాడితే ఏం తలనొప్పి వస్తుందో అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు కామ్ గా ఉన్నారు.

ఎలాగూ పోలింగ్ పూర్తి అయ్యింది. కాంగ్రెస్ కు పెద్దగా ఆశలు లేవు. రఘువీరారెడ్డి కూడా ఈ సారి ఒక్కసారీ చూసే అవకాశం ఉంది. ఈ సారి ఓడితే ఆయన వైఎస్సార్సీపీలోకో - టీడీపీలోకో చేరిపోవడం ఖాయం.

అలాంటప్పుడు ఇలాంటి సమయంలో ఎందుకు స్పందించాలి, స్పందించి మూటగట్టుకునేది ఏమిటనేట్టుగా కనిపిస్తోంది రఘువీరారెడ్డి లెక్క. అటు చంద్రబాబు నాయుడుకీ గట్టిగా సపోర్ట్ చేయడం లేదు - అలాగని ఆయన తీరును వ్యతిరేకించడమూ లేదు.. ఫలితాల వరకూ కాంగ్రెస్ లోని వారు ఇలా కామ్ గా ఉండి - ఆ వెంటనే ఏదో ఒక పార్టీని చూసుకుని జంప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.