Begin typing your search above and press return to search.
ఇందిరమ్మ మత్తులో నుంచి బయటకు రారా?
By: Tupaki Desk | 3 Aug 2018 5:20 AM GMTవస్తువు ఎంత మంచిదైనా.. దానికో ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. ఆ విషయం మీద ఐడియా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. లేకుంటేనే తిప్పలన్ని. తాజాగా కాంగ్రెస్ పరిస్థితి ఇంచుమించు ఇదే కోవకు వస్తుంది. అప్పుడెప్పుడో ముగిసిన ఇందిరమ్మ జమానాను పట్టుకొని.. ఇంకా వేలాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యమనిపించక మానదు. ఇందిరమ్మ పేరు ఎత్తిన వెంటనే.. అత్యవసర పరిస్థితి తీసుకురావటం.. దానికి సమాధానం చెప్పలేక నీళ్లు నమలటం మామూలే.
అప్పుడెప్పుడో ముగిసిన ఇందిరమ్మ జమానా మీద బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అనుసరించే దరిద్రపుగొట్టు విధానాలకు అమ్మగారే ఆది అన్నది మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే నెహ్రూ హయాం నుంచి కుట్రలు.. కుతంత్రాలు కాంగ్రెస్ లో మామూలే అయినా.. ఇందిరమ్మ జమానా మొదలయ్యాక అవి కాస్తా పీక్స్ కు వెళ్లటం తెలిసిందే.
మరి.. అలాంటి పేరును పట్టుకొని నేటి డిజిటల్ ప్రపంచంలోనూ ఏదో చేయాలని చూసే కాంగ్రెస్ నేతల్ని చూస్తే.. వారి అమాయకత్వానికి నవ్వు రాక మానదు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీని ఓడించి.. అధికారాన్ని సొంతం చేసుకుంటామన్న కలను కంటున్నారు. విభజన కారణంగా ఏపీలో సమాధి అయిన పార్టీ ఏదో రకంగా తిరిగి లేవాలన్న తహతహ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. ఏ విభజన కారణంగా ఏపీలో పార్టీ సమాధి అయ్యిందో.. ఇప్పుడు అదే విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో మళ్లీ ప్రాణాలు పోసే కార్యక్రమాన్ని షురూ చేస్తున్నారు. ఇటీవల సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రకటనను చేశారు. ఇదే తరహాలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఏపీలో పార్టీ ప్రాణాల్ని తమకు తామే తీసేసుకున్న వైనాన్ని మర్చిపోకూడదు.
ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా ఇచ్చేది తామేనన్న పాయింట్ పట్టుకొని ఏపీలో మళ్లీ నిలబడాలన్న ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇందిరమ్మ పేరును తీసుకురావటం కనిపిస్తుంది. అప్పుడెప్పుడో ఒక వెలుగు వెలిగి.. తర్వాతి కాలంలో ఆరిపోవటమే కాదు.. అరిగిపోయినట్లుగా మారిన ఇందిరమ్మ కాన్సెప్ట్ ను ఇప్పుడు భుజాలకు ఎత్తుకోవటంలో వచ్చే లాభమేందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఇందిరమ్మ పేరు చెప్పినంతనే కుళ్లు కుతంత్రాల రాజకీయాలు.. అత్యవసర పరిస్థితిని విధించిన వైనం లాంటి ప్రశ్నలను తెర మీదకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఇందిరమ్మ పేరును ప్రస్తావించటంతో లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పాలి. విభజన నిర్ణయం కారణంగా ఏపీలో పాతాళంలోకి కూరుకుపోయిన పార్టీని తిరిగి జవసత్వాలు తెచ్చే క్రమంలో సరికొత్తగా వ్యవహరిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో విజయం కాకున్నా.. కనీసం పది నుంచి పదిహేను సీట్లు సొంతం చేసుకుంటే అదే అత్యద్భుత విజయంగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తీరుచూస్తే.. ఆ పార్టీ ఏపీలో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో అరిగిపోయిన ఇందిరమ్మ మాట స్థానే.. మరో కొత్త మాటను సరికొత్తగా చెబితే ఏమైనా ఫలితం ఉంటుందేమో?