Begin typing your search above and press return to search.
అప్పుల్లో ఆంధ్రా లెక్కలివే ! వింటే షాక్ అవుతారు !
By: Tupaki Desk | 29 April 2022 3:30 PM GMTఅప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్న వైసీపీ సర్కారుకు ఎప్పటికిప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడుతూనే ఉన్నాయి. కొన్ని సార్లు ఖజానా మొత్తం ఖాళీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు బడ్జెట్లో కూడా చూపించకుండా ఖర్చు పెట్టేసిన నిధులూ ఉన్నాయి. ఇవన్నీ అప్పులు రూపంలో తెచ్చినవి తప్ప ఆదాయ రూపంలో వచ్చాక ఏదో ఇతర పనులకు వెచ్చించినవి కాదు. ఓ లెక్క ప్రకారం కరోనా ప్రభావం, తరువాత పరిణామాల రీత్యా ఏపీ ఆదాయం ఘోరంగా పడిపోయింది. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు అన్నది తప్పని సరి కావడంతో మిగిలిన పనులకు నిధులు తీసుకుని రావడం పెద్ద సమస్యగా మారింది. దీంతో సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించగా మిగిలిన కొద్దిపాటి డబ్బులతో రాష్ట్ర సర్కారు నడవని గడ్డు స్థితిలో ఎప్పటికప్పుడు నిర్వహణ కోసం ఎక్కడో ఓ దగ్గర అప్పులు చేయక తప్పడం లేదు అన్నదే నిర్థారణ అవుతోంది. గతం కన్నా భిన్నంగా ఆంధ్రాలో పరిణామాలున్నా కూడా అప్పులపై కనీస అవగాహన అయితే వైసీపీ వర్గాలకు లేదు అన్నది టీడీపీ ఆరోపణ.
ఈ నేపథ్యంలో కొన్ని గణాంకాలు చూద్దాం.
- 2014 నాటికి అంటే రాష్ట్రం విడిపోయే నాటికి
అప్పు వివరం 1.04 లక్షల కోట్లు
- 2014 జూన్ 1 నుంచి 2019 మార్చి 31 వరకూ
టీడీపీ హయాంలో చేసిన
- అప్పు 3.14 లక్షల కోట్లు
మొత్తం అప్పు : 3.18 లక్షల కోట్లు
- 2019 జూన్ 1 నుంచి ఇప్పటిదాకా (మార్చి 30, 2022)
అప్పు 8 లక్షల కోట్లు (ఓ అంచనా)
- ఇందులో సంక్షేమ పథకాలకు వెచ్చించింది 1.35 లక్షల కోట్లు
- మరో రెండేళ్లకు 1.10 లక్షల కోట్లు వెచ్చించాలనుకుంటున్నారు
అంటే మొత్తం 2.45 లక్షల కోట్లు
(ఏడాదికి 55 వేల కోట్ల చొప్పున రానున్న రెండేళ్ల కూ సంక్షేమ పథకాల అమలుకి నిధులు)
- 5.55 లక్షల కోట్లు ఉద్యోగుల జీత భత్యాలు..ఇతర రంగాలకు కేటాయింపులు.
- మొత్తం అప్పు : 9.10 లక్షల కోట్లు + 3.18 లక్షల కోట్లు = 12.28 లక్షల కోట్లు (2024 వరకూ)
అంటే పదేళ్ల కాల వ్యవధికి అవశేషాంధ్ర ఏడాదికి 12.28 లక్షల కోట్ల అప్పు చేసిందని తేలింది.
- టీడీపీ హయాంలో అప్పులకు మూడు రెట్లు అప్పులు ఐదేళ్ల కాల వ్యవధికి చేయనుందని తేలిపోయింది.
- లక్ష కోట్ల బడ్జెట్ అనుకుంటే యాభై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలకు కేటాయించినా మిగతా 45 వేల కోట్లు అభివృద్ధికీ ఇతర రంగాలకూ కేటాయించవచ్చు. కానీ మనది రెండు లక్షల కోట్ల 56 వేల కోట్లతో కూడిన బడ్జెట్ మరిచిపోవద్దు ఆ సంగతి !
అంటే సంక్షేమ పథకాలకు కేటాయించిన యాభై ఐదు వేలు తీసేస్తే మిగతా 2.01 లక్షల కోట్లు ఏమయ్యాయో ! పై వాడికే ఎరుక ! దేవుడా రక్షించు నా ఆంధ్రాను !
ఇంకా ఇతర వివరాలివి..
- కేంద్రం నుంచి గ్రాంట్ 37 వేల కోట్లు రావాల్సి ఉంది.
- పన్నుల రూపంలో (జీఎస్టీ అన్నీ కలుపుకుని) 34 వేల కోట్లు
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 67 వేల కోట్లు వార్షికాదాయం..55 వేల కోట్లు పథకాలు
- ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంను మూల ధన ఆదాయం అంటారు.
- ఇది సుమారు 20 వేల కోట్లు (అంచనా)
- రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ : 90 వేల కోట్లు (అంచనా)
- ఊహకు అనుగుణంగా అంచనాలకు అనుగుణంగా ఖజానాకు నిధుల చేరిక లేదు
మనకు వస్తున్న ఆదాయం అంతంత మాత్రమే!
- కేంద్రం నుంచి వివిధ రూపంలో రావాల్సిన నిధులు 80 వేల కోట్లు అంచనా
- 22 వేల కోట్లు వచ్చాయి.. కారణం రాష్ట్రం పై చిన్న చూపు
- ఎప్పుడయితే ఆదాయం తగ్గిందో అప్పులకు సంబంధించి అన్వేషణ ప్రారంభం అయింది.
- మన ఆదాయం లో సంక్షేమ పథకాల నిర్వహణను మినహాయిస్తే మిగిలేది 12 వేల కోట్లు
- కానీ ఏడాదికి మనోళ్లు 1.28 లక్షల కోట్లు అప్పు ఉంది అని తేలింది.
- ఆదాయంను పరిగణనలోకి అప్పు దాని కన్నా పది రెట్లు.
- ఏడాది కి అప్పులకు వడ్డీలు ఓ నివేదిక ప్రకారం 38,000 కోట్లు
- అంటే 3,166 కోట్లకు పైగా.. నెలకు చెల్లిస్తున్న వడ్డీ అంటే ఆశ్చర్యపోక తప్పదు.