Begin typing your search above and press return to search.

సెంట్రల్ బడ్జెట్ లో ఏపీ విష్ లిస్ట్

By:  Tupaki Desk   |   29 Feb 2016 6:27 AM GMT
సెంట్రల్ బడ్జెట్ లో ఏపీ విష్ లిస్ట్
X
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్న 2016-17 వార్షిక బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ కోటి ఆశలు పెంచుకుంది. రాష్ట్రానికి నిధుల కేటాయింపునకు బడ్జెట్ పెద్దపీట వేస్తుందని ఆశిస్తున్నది. ఈ మేరకు ప్రతిపాదనకు కూడా కేంద్రానికి పంపింది. రెవెన్యూ లోటు భర్తీ చేయాలని అభ్యర్థించింది. రాష్ట్రంలో ఏడు వెనుకబడిన జిల్లాలకు అధిక నిధులు కేటాయించాలని, అమరావతిలో పెట్టబడులకు రాయితీ ఇవ్వాలని కోరింది. ఏపీలో ఏర్పాటవుతున్న జాతీయ విద్యాసంస్థలకూ భారీగా నిధులిచ్చి వాటి అభివృద్ధికి సహకరించాలని కోరింది.

ఇవీ డిమాండ్లు...

- రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 4వేలకోట్ల ప్రతిపాదనలు పంపింది.

- విజయవాడ - మెట్రో - విశాఖ మెట్రోకు నిధులు, అమరావతిలో వసతుల కల్పన - పెట్టుబడుల రాయితీ - పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాలని కోరింది.

- ఏపీకి ప్రత్యేక హోదాకు అభ్యర్థించింది.

- పోలవరానికి 2016-17కు రూ. 4వేల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

- ఓడరేవు అభివృద్ధికి నిధులు, జాతీయ విద్యాసంస్థల అభివృద్ధికి రూ. 3,500 కోట్ల నిధులివ్వాలని ప్రతిపాదించింది.