Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా ఏపీ పోలీస్ బాస్ సింప్లిసిటీ
By: Tupaki Desk | 4 Jan 2018 5:18 AM GMTఅత్యున్నత స్థానాల్లో ఉండే వారికి ఏర్పాటు చేసే భద్రత.. సిబ్బంది.. ఆ హడావుడి ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి హడావుడికి దూరంగా ఉంటూ.. సింఫుల్ గా ఉండే వారు చాలా అరుదుగా ఉంటారు. నీతికి.. నిజాయితీకి మారుపేరుగా నిలుస్తూ.. రూల్స్ విషయంలో పక్కాగా పాటిస్తారన్న పేరు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు మాలకొండయ్య.
జనసామ్యానికి మాలకొండయన్న అన్న వెంటనే పూనం మాలకొండయ్య గుర్తుకు వస్తారు. నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం.. ఎంతటి వారైనా రూల్ కు భిన్నంగా వ్యవహరిస్తే తాట తీస్తారన్న పేరున్న పూనం.. మాలకొండయ్య సతీమణి. భార్య భర్తలిద్దరిలో ఒకరు ఐఏఎస్ అయితే.. మరొకరు ఐపీఎస్. ఇద్దరికి ఇద్దరూ అన్నట్లుగా నిజాయితీకి ప్రతిరూపాలుగా ఉంటారు.
సింఫుల్ గా ఉండటం.. సౌమ్యంగా వ్యవహరించటం లాంటివి మాలకొండయ్యకున్న అదనపు ఆకర్షణలుగా చెప్పాలి. నిజాయితీకి తోడుగా ఉన్న వీటితో ఆయన్ను పలువురు అభిమానిస్తుంటారు. తాజాగా ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. తన తీరుతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి మరో ఆర్నెల్లు డీజీపగా పదవిలో ఉండనున్నారు.
అమరావతిలోని ఏపీసచివాలయంలో సీఎస్ నిర్వహించిన సమీక్షా కార్యక్రమానికి డీజీపీ మాలకొండయ్య హాజరయ్యారు. డీజీపీ స్థాయిలో ఉండే అధికారి వస్తున్నారంటే హడావుడి ఏ తీరులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోకి డీజీపీగా బాధ్యతల్ని కొత్తగా చేపట్టినప్పుడు అధికారుల అలెర్ట్ నెస్ వేరుగా ఉంటుంది.
సచివాలయానికి వచ్చిన మాలకొండయ్య వెంట భారీ కాన్వాయ్ ఉంది. ప్రోటోకాల్ ప్రకారం ఉండే ఈ కాన్వాయ్ ను సచివాలయం గేటు బయటే వదిలేసిన ఆయన.. సింపుల్ గా తన కారులో సచివాలయానికి చేరుకున్నారు. తన వాహనం నుంచి నడుచుకుంటూ మొదటి బ్లాక్ లోని సీఎస్ కార్యాలయానికి చేరుకొని సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 1985 బ్యాచ్ కు చెందిన మాలకొండయ్య ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు ఆర్టీసీ ఎండీగా వ్యవహరించారు. ఏమైనా.. అత్యున్నత స్థానాల్లో ఉండేవారు సింఫుల్ గాఉండటం ద్వారా పలువరి దృష్టిని మాలకొండయ్య ఆకర్షించారని చెప్పక తప్పదు.