Begin typing your search above and press return to search.
అభిమానులు హద్దులు దాటితే తాట తీస్తారట
By: Tupaki Desk | 7 Jan 2017 7:51 AM GMTఒక విచిత్రమైన పరిస్థితి ఏపీలో నెలకొంది. ఈ సంక్రాంతి బరిలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు విడుదల కావటం.. ఈ రెండు సినిమాలు ఆయా హీరోల వ్యక్తిగత ప్రతిష్టలకు ముడిపడి ఉండటంతో ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందా? అని సగటు సినిమా అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. సదరు హీరోల అభిమానుల వ్యవహారం మాత్రం అందుకుభిన్నంగా ఉంది.
తమ అభిమాన హీరోలకు ప్రతిష్ఠాత్మకమైన సినిమాల్ని.. అభిమానులు సైతంఅంతే ప్రతిష్ఠాత్మకంగా భావించటంతో వాతావరణం వేడెక్కింది. ప్రతి విషయంలోనూ పోటీపోటీగా ఉండటమే కాదు.. తాము ఏ మాత్రం తగ్గమన్నట్లుగా ఇరు వర్గాలు వ్యవహరిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ తీరు రెండు తెలుగురాష్ట్రాల్లో లేకుండా ఒక్క ఏపీలోనే ఉండటం గమనార్హం.
బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి.. చిరు నూటయాభయ్యో చిత్రం ఖైదీ నంబరు 150 సినిమాలు ఈ సంక్రాంతి పండక్కి వస్తుండటం తెలిసిందే. దీంతో.. ఈ సినిమాల రిలీజ్ సందర్భంగా అభిమానుల హడావుడి ఒక రేంజ్లో ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఇరువురు హీరోల సామాజిక నేపథ్యాలు.. రాజకీయ నేపథ్యాలు సైతం అభిమానుల ‘అభిమానం’పై ప్రభావం చూపిస్తాయన్న వాదన వినిపిస్తోంది.
దీంతో.. ఇరు వర్గాలకు చెందిన అభిమానులు హద్దులు దాటిన అభిమానం ప్రదర్శిస్తే ఏం చేయాలన్నది ఏపీ పోలీసులకు ఇప్పుడు పెద్ద టెన్షన్ గా మారింది. అందుకేనేమో.. ఏపీ పోలీస్ బాస్ తాజాగా భారీ హెచ్చరికనే చేశారు. అభిమానులు హద్దులు దాటిన అభిమానాన్ని ప్రదర్శిస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చేశారు. ముఖ్యంగా.. ఇతర హీరోల బ్యానర్లు.. పోస్టర్లు చించే వారిపైనా.. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని ఏపీ డీజీపీ చెప్పటం గమనార్హం. రెండు పెద్ద సినిమాలు విడుదల నేపథ్యంలో చోటు చేసుకునే పరిణామాలపై డీజీపీ ప్రత్యేకంగా సమీక్షను ఏర్పాటు చేసినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రెండు పెద్ద సినిమాలు విడుదలపై పోలీస్ బాస్ రివ్యూ చేయటం అంటేనే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/