Begin typing your search above and press return to search.
అటు అంబరాల సంబరాలు.. ఇటు శోక సంద్రాలు
By: Tupaki Desk | 3 Jun 2016 7:45 AM GMTసంవత్సరంలో మిగిలిన రోజులన్నీ ఒక ఎత్తు అయితే జూన్ 2 మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి భిన్నమైన పరిస్థితి అన్న విషయం మరోసారి తేలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు అధికారికంగా విడిపోయి.. ఎవరి దారి వారు చూసుకునేందుకు వీలు కల్పించిన రోజు తెలుగువాళ్లను నిట్టనిలువునా చీల్చేసిందన్న చారిత్రక సత్యం మరోసారి రుజువైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని తాకేలా సంబురాలు జరిగిన పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా పల్ల పల్లె సంబరాల్ని భారీగానే చేసుకుంది. అదే సమయంలో కొన్ని చోట్ల నిరసనలు కూడా నిర్వహించారు. అయితే.. ఇదంతా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మీదనే అని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణాన్ని తలపించిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. సీమాంధ్ర పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. విభజన గాయం గుర్తుకు తీసుకురావటమే కాదు.. తమ పరిస్థితి మీద సందేహాలతో సీమాంధ్రులు కాలం గడిపిన పరిస్థితి. ఇష్టారాజ్యంగా.. తమ మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తూ తీసుకున్న నిర్ణయాలతో తమను దెబ్బ తీసిన నాటి సర్కారు తీరును మరోసారి గుర్తుకు తెచ్చుకున్న రోజు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల పరిస్థితి. తీవ్ర భావోద్వేగానికి గురైన పరిస్థితి. ఉన్న ప్రాంతంలో జరుగుతున్న సంబరాల్ని పూర్తిస్థాయిలో అస్వాదించలేని పరిస్థితి. సొంత ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేని దుస్థితి.
సంబరాలకు వీరు వ్యతిరేకం కాకున్నా.. విభజన న్యాయంగా జరిగి ఉంటే బాగుండేదన్న భావన వారిని గంభీరంగా మార్చిందని చెప్పాలి. దూరాన ఉన్న సీమాంధ్రుల కంటే కూడా.. హైదరాబాద్ లో ఉన్న వారు తీవ్రభావోద్వేగానికి గురైన పరిస్థితి. మొత్తంగా చూస్తే.. క్యాలెండర్లోని అన్ని రోజులు ఒక ఎత్తు అయితే.. తెలుగు ప్రజల వరకూ ‘‘జూన్ 2’’ పూర్తి భిన్నమైన రోజన్న విషయం మరోసారి స్పష్టమైంది.